- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రిషీ.. చిరునవ్వు ఇవ్వంటున్న నీతూ
<p>బాలీవుడ్ లెజెండరీ హీరో ‘రిషి కపూర్’ ఈ లోకాన్ని వదిలి నెలరోజులు గడిచాయి. వెండితెర రొమాంటిక్ హీరోగా ముద్రవేసుకున్న చింటును ప్రేమించి పెళ్లి చేసుకున్న నీతూ కపూర్.. ఈ సందర్భంగా తన భర్తను స్మరించుకుంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. యంగ్ ఏజ్‌లో బ్లూ కలర్ డ్రెస్‌లో ఉన్న ఇద్దరి ఫొటోను షేర్ చేసిన నీతూ.. ‘వెర లిన్’ అనే క్లాసికల్ సాంగ్‌తో నివాళులు అర్పించింది. ‘మీరు నాకు వీడ్కోలు పలికినప్పుడు శుభాకాంక్షలు చెప్పండి.. ఇక్కడ నేను నా […]</p>

బాలీవుడ్ లెజెండరీ హీరో ‘రిషి కపూర్’ ఈ లోకాన్ని వదిలి నెలరోజులు గడిచాయి. వెండితెర రొమాంటిక్ హీరోగా ముద్రవేసుకున్న చింటును ప్రేమించి పెళ్లి చేసుకున్న నీతూ కపూర్.. ఈ సందర్భంగా తన భర్తను స్మరించుకుంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. యంగ్ ఏజ్‌లో బ్లూ కలర్ డ్రెస్‌లో ఉన్న ఇద్దరి ఫొటోను షేర్ చేసిన నీతూ.. ‘వెర లిన్’ అనే క్లాసికల్ సాంగ్‌తో నివాళులు అర్పించింది.
‘మీరు నాకు వీడ్కోలు పలికినప్పుడు శుభాకాంక్షలు చెప్పండి.. ఇక్కడ నేను నా మార్గంలో వెళ్తాను. కంటిలో కన్నీటితో కాదు, ఉల్లాసంతో నాకు చిరునవ్వు ఇవ్వండి.. దూరంగా ఉన్నప్పుడు నా మనసులో భద్రపరుచుకుంటాను’ అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది నీతూ. దీంతో సినీ ప్రముఖులు, అభిమానులు ఈ పోస్ట్‌పై స్పందించారు. ‘మీ ప్రేమ నిజమైంది.. ఆ దేవుడు మీకు మరింత బలాన్ని చేకూర్చాలని కోరుకుంటున్నాం’ అని తెలిపారు.
ఇంతకు ముందు కూడా రిషి కపూర్‌ను తలుచుకుంటూ నీతూ కపూర్ పోస్ట్ పెట్టారు. ఏప్రిల్ 30న ఆయన మరణించగా.. మే 2న ‘మా కథకు ముగింపు’ అంటూ చేతిలో మందు గ్లాస్, ముఖంలో చెరగని చిరునవ్వుతో ఉన్న భర్త ఫోటోను షేర్ చేసింది.
View this post on Instagram
A post shared by neetu Kapoor. Fightingfyt (@neetu54) on May 29, 2020 at 11:34pm PDT






