- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గణేశుడి లాకెట్‌తో రిహానా టాప్‌లెస్ పోజ్.. భగ్గుముంటున్న భారతీయులు
<p>దిశ,వెబ్‌డెస్క్: కేంద్రం ప్రవేశ పెట్టిన వ్యవసాయ చట్టాలపై రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతు పలికిన పాప్ సింగర్ రిహానా మరోసారి హాట్ టాపిగ్గా మారారు. నగ్నంగా ఫోజులిచ్చిన ఫోటోల్ని ట్వీట్ చేయడంపై భారతీయులు మండిపడుతున్నారు. రిహానా! ఏంటమ్మా గణేశుడి లాకెట్ తో ఆ నగ్నంగా పోజులంటూ విమర్శిస్తున్నారు. ట్రాక్టర్ ర్యాలీపై కామెంట్స్ ఇటీవల జనవరి 26 గణతంత్ర దినోత్సవం రోజున చేపట్టిన రైతుల ట్రాక్టర్ ర్యాలీ పెను విధ్వంసానికి దారితీసిన విషయం తెలిసిందే. ఆరోజు జరిగిన హింసాత్మక ఘటనల్లో […]</p>

దిశ,వెబ్‌డెస్క్: కేంద్రం ప్రవేశ పెట్టిన వ్యవసాయ చట్టాలపై రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతు పలికిన పాప్ సింగర్ రిహానా మరోసారి హాట్ టాపిగ్గా మారారు. నగ్నంగా ఫోజులిచ్చిన ఫోటోల్ని ట్వీట్ చేయడంపై భారతీయులు మండిపడుతున్నారు. రిహానా! ఏంటమ్మా గణేశుడి లాకెట్ తో ఆ నగ్నంగా పోజులంటూ విమర్శిస్తున్నారు.
ట్రాక్టర్ ర్యాలీపై కామెంట్స్
ఇటీవల జనవరి 26 గణతంత్ర దినోత్సవం రోజున చేపట్టిన రైతుల ట్రాక్టర్ ర్యాలీ పెను విధ్వంసానికి దారితీసిన విషయం తెలిసిందే. ఆరోజు జరిగిన హింసాత్మక ఘటనల్లో ఓ యువరైతు ట్రాక్టర్ తిరగబడి మరణించగా.. ఆందోళనకారుల దాడుల్లో 200మందికి పైగా పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో రైతుల ఆందోళన ముసుగులో విధ్వంసం సృష్టించేలా కుట్ర జరుగుతుందంటూ కేంద్రం పలు ఆంక్షలు విధించింది. రాజధానిలో రైతుల ఆందోళనకు ఆంక్షలు విధించడంతో అంతర్జాతీయ స్థాయిలో పలువురు ప్రముఖులు మద్దతు పలికారు. స్వీడన్ కు చెందిన పర్యావరణ పరిరక్షకురాలు గ్రెటా థెన్ బర్గ్, పాప్ సింగర్ రిహానా, కమలా హ్యారిస్ బంధువు మీనా హ్యారిస్ లు రైతులకు మద్దతుగా ప్రకటన చేశారు. ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేయడాన్ని తప్పుబట్టారు.
పర్యావరణ పరిరక్షణ కార్యకర్త గ్రేటా థన్ బర్గ్ రైతులకు మద్దతుగా సంఘీభావం తెలిపింది. ఆమె తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రైతుల ఉద్యమం సాగుతున్న తీరు, ఢిల్లీలో పలు ప్రాంతాల్లో విధించిన ఆంక్షల వంటి అంశాలను ప్రస్తావిస్తూ థన్ బర్గ్ తన పోస్ట్‌కు జత చేశారు. అంతర్జాలాన్ని నిలిపివేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కమలా హ్యారిస్ బంధువు మీనా హ్యారిస్. రైతులపై పారా మిలటరీ దాడిని ఖండించారు. నియంతృత్వ, నిరంకుశ వాదులు ఇంకా ఉన్నారని గుర్తిస్తేనే ఇలాంటి వాటిని ఆపగలమని పేర్కొన్నారు.
రైతుల ఉద్యమంపై సీరియస్
అంతకు ముందు పాప్ సింగర్ రిహానా సైతం భారత్ లో రైతులు చేస్తున్న ఉద్యమంపై మాట్లాడారు. మనమెందుకు దీని గురించి ఎందుకు మాట్లాడడం లేదంటూ రైతుల ఉద్యమంపై సీఎన్ ఎన్ కథనాన్ని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ రెండు రోజుల పాటు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొంతమంది ఆమె ట్వీట్ కు మద్దతు తెలిపితే మరికొందరు పూర్తి స్థాయి అవగాహన తర్వాత స్పందించాలని కామెంట్స్ చేశారు.
టాప్‌లెస్ పోజ్ లతో వివాదం
తాజాగా పాప్ సింగర్ రిహానా భారత్ లో హాట్ టాపిగ్గా మారారు. రిహానా సావేజ్ ఎక్స్ ఫెంటీ పేరుతో ఈకామర్స్ సంస్థను నిర్వహిస్తుంది. ఆ సంస్థకు చెందిన దుస్తులతో పాటు బ్రాండెడ్ వస్తువులు, గోల్డ్, డైమండ్స్ ను ప్రమోట్ చేస్తూ సొమ్ము చేసుకుంటుంది. అయితే బుధవారం తన సావేజ్ ఎక్స్ ఫెంటీ సంస్థకు చెందిన లాకెట్ ను ధరించి పోజులిచ్చింది. అంతవరకూ బాగున్నా ఆమె ధరించిన లాకెట్ లో హిందువుల ఆరాధ్య దైవమైన గణేశ ప్రతిమ గల నెక్లెస్ ధరించి సెమి న్యూడ్ గా ఫోటో షూట్ లో పాల్గొనడం వివాదాస్పదంగా మారింది. మెడలో వినాయకుడి లాకెట్‌తో ఉన్న హారం ధరించి నగ్నంగా పోజులిచ్చిన ఫోటోల్ని ట్వీట్ చేసింది. ఆ ఫోటోలపై భారతీయులు భగ్గుమంటున్నారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్ని కించపరుస్తుందని, వెంటనే దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ట్వీట్ చేస్తున్నారు.
భారతీయ సంస్కృతిని, సంప్రదాయాన్ని మంట గలుపుతున్న రిహానా వంటి వారి నుంచి రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలు సాయం పొందడాన్ని మానుకోవాలని బీజేపీ నేత రామ్ కదమ్ ట్వీట్ చేశారు.






