- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టెన్షన్ పెట్టిన ఆ క్రికెటర్ కోవిడ్ టెస్టులు
<p>దిశ, స్పోర్ట్స్ : కోల్‌కతా నైట్ రైడర్స్(కేకేఆర్) బ్యాట్స్‌మాన్ నితీష్ రాణా కోవిడ్ టెస్టులు జట్టు యాజమాన్యాన్ని కలవరపెట్టాయి. తొలి విడత మ్యాచ్‌లు ఆడటానికి కేకేఆర్ జట్టు ముంబయికి చేరుకున్నది. జట్టుతో చేరడానికి మార్చి 21న ముంబయి చేరిన రాణాకు కోవిడ్ పరీక్ష నిర్వహించగా కరోనా నెగెటివ్ వచ్చింది. అయితే బీసీసీఐ ప్రోటోకాల్‌లో భాగంగా మరుసటి రోజు మరోసారి పరీక్ష చేయగా నితీష్‌కు పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. దీంతో కంగారు పడిన యాజమాన్యం వెంటనే ఐపీఎల్ ప్రోటోకాల్‌లో […]</p>

దిశ, స్పోర్ట్స్ : కోల్‌కతా నైట్ రైడర్స్(కేకేఆర్) బ్యాట్స్‌మాన్ నితీష్ రాణా కోవిడ్ టెస్టులు జట్టు యాజమాన్యాన్ని కలవరపెట్టాయి. తొలి విడత మ్యాచ్‌లు ఆడటానికి కేకేఆర్ జట్టు ముంబయికి చేరుకున్నది. జట్టుతో చేరడానికి మార్చి 21న ముంబయి చేరిన రాణాకు కోవిడ్ పరీక్ష నిర్వహించగా కరోనా నెగెటివ్ వచ్చింది. అయితే బీసీసీఐ ప్రోటోకాల్‌లో భాగంగా మరుసటి రోజు మరోసారి పరీక్ష చేయగా నితీష్‌కు పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. దీంతో కంగారు పడిన యాజమాన్యం వెంటనే ఐపీఎల్ ప్రోటోకాల్‌లో భాగంగా అతడిని సెల్ఫ్ ఐసోలేషన్‌కు పంపింది. కాగా, గురువారం మరోసారి రాణాకు కోవిడ్ టెస్టులు నిర్వహించగా నెగెటివ్‌గా తేలాడు. దీంతో కేకేఆర్ యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది. ఎస్‌వోపీలో భాగంగా నితీష్ రాణాకు మరోసారి కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తామని.. అప్పుడు కూడా నెగెటివ్ వస్తేనే జట్టుతో చేరడానికి యాజమాన్యం స్పష్టం చేసింది.






