- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోడ్డుపై ‘రయ్’మంటూ దూసుకెళ్లిన మంత్రి.. నెటిజన్ల కామెంట్స్.. వీడియో వైరల్
<p>దిశ, డైనమిక్ బ్యూరో : దేశంలోని రోడ్లపై 100 స్పీడ్ దాటగానే ఓవర్ స్పీడ్ కారణంగా జరిమానా అంటూ మొబైల్‌కి మెసేజ్ వచ్చేస్తుంది. మరి.. అదే ఓ కేంద్ర మంత్రి ఏకంగా 170 కిలోమీటర్ల వేగంతో రోడ్డుపై దూసుకెళ్లారు. దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. వివరాల్లోకెళితే.. ఢిల్లీ నుంచి ముంబైకి కేవలం12 గంటల్లో చేరుకునేందుకు కేంద్రం ఎక్స్‌ప్రెస్ హైవేని నిర్మిస్తోంది. ఈ నిర్మాణ పనులను పరిశీలించడానికి వచ్చిన కేంద్ర […]</p>

దిశ, డైనమిక్ బ్యూరో : దేశంలోని రోడ్లపై 100 స్పీడ్ దాటగానే ఓవర్ స్పీడ్ కారణంగా జరిమానా అంటూ మొబైల్‌కి మెసేజ్ వచ్చేస్తుంది. మరి.. అదే ఓ కేంద్ర మంత్రి ఏకంగా 170 కిలోమీటర్ల వేగంతో రోడ్డుపై దూసుకెళ్లారు. దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. వివరాల్లోకెళితే.. ఢిల్లీ నుంచి ముంబైకి కేవలం12 గంటల్లో చేరుకునేందుకు కేంద్రం ఎక్స్‌ప్రెస్ హైవేని నిర్మిస్తోంది.
ఈ నిర్మాణ పనులను పరిశీలించడానికి వచ్చిన కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, స్వయంగా స్పీడ్ టెస్టు కూడా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయన నిర్మాణ దశలో ఉన్న ఆ రహదారిపై 170 కిలోమీటర్ల వేగంతో కారులో దూసుకుపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. రూ.98 వేల కోట్లతో ఈ హైవేను నిర్మిస్తున్నారు. 2023 మార్చి వరకూ హైవే అందుబాటులోకి రానుంది.
Delhi – Mumbai Expressway under construction
Trial Run
Test Speed 170 Kmph
#PragatiKaHighway pic.twitter.com/4hw7WUhbao— rajiv tuli (@rajivtuli69) September 19, 2021






