‘పవర్ పేట’లో పవన్ అభిమాని డిఫరెంట్ లుక్స్

by  |
‘పవర్ పేట’లో పవన్ అభిమాని డిఫరెంట్ లుక్స్
X

యంగ్ హీరో నితిన్ వరుస ప్రాజెక్టులను లైన్‌లో పెట్టాడు. చివరగా ‘భీష్మ’ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన తను.. వెంటనే ‘అంధాదున్’ రీమేక్ మూవీ లాంచ్ చేశాడు. ఆ తర్వాత కృష్ణ చైతన్య దర్శకుడిగా ‘పవర్ పేట’ చిత్నాన్ని కూడా ప్రకటించాడు. ఇవేకాక ‘రంగ్‌దే’తో పాటు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో మరో సినిమా సైతం కమిట్ అయ్యాడు. అంటే దాదాపు రెండేళ్ల పాటు నితిన్ డైరీ ఫుల్‌గా నిండిపోయిందన్న మాట.

ఇదిలా ఉంటే, నితిన్ ‘పవర్ పేట’ చిత్రం గురించిన వార్తలు ఫిల్మ్ నగర్‌లో షికారు చేస్తున్నాయి. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ సినిమా రెండు పార్ట్‌లుగా తెరకెక్కనుండగా.. నితిన్ క్యారెక్టర్ డిజైన్ చాలా కొత్తగా ఉంటుందని సమాచారం. ఈ సినిమాలో నితిన్ యువకుడిగా, మధ్య వయసున్న వ్యక్తిగా, వృద్ధుడిగా కనిపిస్తాడని తెలుస్తుండగా.. ఇందుకు సంబంధించిన మేకప్ కోసం ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్‌ను తీసుకురానున్నారట. డిఫరెంట్ లుక్స్‌తో అదరగొట్టేందుకు నితిన్ రెడీ అవుతుండగా.. అభిమాన హీరోను ఓకే సినిమాలో డిఫరెంట్ లుక్స్‌తో చూసేందుకు ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. కాగా ‘రంగ్‌దే’తో పాటు ఈ సినిమాలోనూ కీర్తి సురేష్ నితిన్‌తో జతకట్టనుండటం విశేషం.



Next Story

Most Viewed