నితిన్ ‘మ్యాస్ట్రో’ ఫైనల్ షెడ్యూల్

by  |
నితిన్ ‘మ్యాస్ట్రో’ ఫైనల్ షెడ్యూల్
X

దిశ, సినిమా: యంగ్ హీరో నితిన్ ‘మ్యాస్ట్రో’ ఫైనల్ షెడ్యూల్ ప్రారంభమైంది. తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో షూటింగ్ స్టార్ట్ చేసింది మూవీ యూనిట్. మేర్లపాక గాంధీ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాను శ్రేష్ఠ్ మూవీస్ నిర్మి్స్తుండగా.. తమన్నా భాటియా కీలకపాత్రలో కనిపించబోతోంది. హిందీ పిక్చర్ ‘అంధాదున్’ రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాలో నభా నటేష్ హీరోయిన్ కాగా హైదరాబాద్‌లో ఫైనల్ పార్ట్ షూటింగ్ జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో నితిన్, తమన్నాలపై కీలక సన్నివేశాల చిత్రీకరణతో మూవీ పూర్తవుతుండగా.. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తామన్నారు మేకర్స్. కొవిడ్ సెకండ్ వేవ్ తర్వాత చిత్రీకరణ మొదలుపెట్టిన బిగ్ బడ్జెట్ మూవీ ఇదే కాగా.. మహతీ స్వరసాగర్ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు. కాగా ఇప్పటికే విడుదలైన ‘మ్యాస్ట్రో’ ఫస్ట్ లుక్, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

Next Story

Most Viewed