‘చెక్’ పోస్ట్‌పోన్డ్.. కారణమిదే!

by  |
‘చెక్’ పోస్ట్‌పోన్డ్.. కారణమిదే!
X

దిశ, సినిమా: యంగ్ హీరో నితిన్ ‘చెక్’ మూవీ రిలీజ్ డేట్ చేంజ్ అయింది. ఫిబ్రవరి 19న విడుదల చేస్తామని ముందుగా ప్రకటించిన మేకర్స్.. ఫిబ్రవరి 26కు పోస్ట్‌పోన్ చేస్తున్నట్లు ప్రకటించారు. సీజీ వర్క్స్ పూర్తి కాకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. నితిన్.. టెర్రరిస్ట్‌ ముద్రపడిన చెస్ ప్లేయర్‌గా కనిపించబోతున్న సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ లాయర్‌గా నటిస్తోంది. కాగా ఈ మధ్యే రిలీజైన ట్రైలర్‌ సినిమాపై హైప్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చెస్ ప్లేయర్ హారిక ద్రోణవల్లితో పాటు సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, కీర్తీ సురేష్ లాంటి సెలబ్రిటీలు సైతం బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇచ్చారు. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో డైలాగ్స్ ఆకట్టుకోగా.. సినిమా కోసం ఆడియన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. దీంతో రిలీజ్ డేట్ చేంజ్ అయినా సరే ఎలాంటి ఎఫెక్ట్ పడదనే నమ్మకంతో ఉన్నారు మేకర్స్. ప్రియా ప్రకాశ్ వారియర్, సిమ్రన్ చౌదరి, సాయి చంద్, సంపత్ రాజ్, పోసాని కృష్ణ మురళి, మురళి శర్మ కీలక పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమాను భవ్య క్రియేషన్స్ నిర్మించింది.

Next Story

Most Viewed