- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాజీ ఎమ్మెల్యే ఏలేటికి కరోనా పాజిటివ్
by Chintha Aamani |
<p>దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: నిర్మల్ మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర రెడ్డి కరోనా బారిన పడ్డారు. హైదరాబాదులోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా తనకు కరోనా ఎలా వ్యాప్తి చెందిన విషయం తెలియదని ఆయన చెప్పారు. అపోలో దవాఖానలో తాను చికిత్స పొందుతున్నానని, ఇప్పటివరకూ ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు చెప్పినట్టు మహేశ్వర్ రెడ్డి “దిశ” ప్రతినిధికి తెలిపారు. తనకు కరోనా సోకిన విషయం తెలిసిన వెంటనే మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సహకారంతో […]</p>

X
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: నిర్మల్ మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర రెడ్డి కరోనా బారిన పడ్డారు. హైదరాబాదులోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా తనకు కరోనా ఎలా వ్యాప్తి చెందిన విషయం తెలియదని ఆయన చెప్పారు. అపోలో దవాఖానలో తాను చికిత్స పొందుతున్నానని, ఇప్పటివరకూ ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు చెప్పినట్టు మహేశ్వర్ రెడ్డి “దిశ” ప్రతినిధికి తెలిపారు. తనకు కరోనా సోకిన విషయం తెలిసిన వెంటనే మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సహకారంతో అపోలో ఆసుపత్రిలో చేరినట్టు తెలిపారు. ఇప్పటికే తాను పూర్తిగా కోలుకున్నానని తెలిపారు. నిర్మల్ నియోజకవర్గ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తాను నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతోనే కరోనా బారి నుంచి బయటపడ్డానని తెలిపారు.
Next Story






