Nikki Galrani: అక్క జైలుకి వెళ్లినప్పుడు నేను లేకపోవడానికి అదే కారణం- నటి

by  |
Nikki Galrani: అక్క జైలుకి వెళ్లినప్పుడు నేను లేకపోవడానికి అదే కారణం- నటి
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ లో ‘మలుపు’ చిత్రంతో తెలుగువారికి దగ్గరైన బ్యూటీ నిక్కీ గల్రానీ. ‘బుజ్జిగాడు’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శాండిల్ వుడ్ భామ సంజన గల్రానీ ముద్దుల చెల్లెలు ఈమె అని అందరికి తెలిసిందే. అయితే గత కొన్ని రోజుల క్రితం సంజన డ్రగ్ కేసులో అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయటికొచ్చిన విషయం విదితమే. ఈ విషయంలో ఆమెకు వారి కుటుంబ సభ్యులు కూడా మద్దతు ఇవ్వలేదంటూ పలు మీడియాలో వార్తలు వచ్చాయి. ఇక ఈ విషయమై తాజాగా సంజన చెల్లెలు నిక్కీ గల్రానీ స్పందించింది.

లాక్ డౌన్ కారణంగా తాను ఆ సమయంలో చెన్నై లో ఉన్నానని, అక్క బెంగుళూరులో ఉండడం వలన తాను అక్కడికి రాలేకపోయానని తెలిపింది. అక్క జైల్లో ఉన్నప్పుడు చాలా బాధపడ్డానని, ఎప్పటికైనా నిజం బయటికి వస్తుందన్న నిక్కీ త్వరలో అక్కమీద ఉన్న ఆరోపణలన్నీ క్లియర్ అవుతాయనే నమ్మకం ఉందని తెలిపింది. ఈ కేసు నుంచి కోలుకునే సమయంలో తమ ఫ్యామిలీ మానసికంగా మరింత స్ట్రాంగ్ అయ్యిందని చెప్పింది. తామిద్దరం చిన్నప్పటినుండి అక్కచెల్లెళ్లుగా పెరగలేదని, స్నేహితులుగా పెరిగామని తెలిపింది. తమ బంధం ఎప్పటికి ఇలాగే ఉంటుందని, అక్క ప్రతి కష్టంలో తాను సపోర్ట్ చేస్తానని చెప్పుకొచ్చింది.



Next Story

Most Viewed