"18 పేజెస్" లో నిఖిల్ చాలెంజ్ రోల్

by  |
18 పేజెస్ లో నిఖిల్ చాలెంజ్ రోల్
X

హీరో నిఖిల్ సిద్ధార్థ్ సరి కొత్త ప్రయోగాలు చేస్తున్నాడు. స్వామి రారా, కార్తికేయ, లేటెస్ట్ గా అర్జున్ సురవరం లాంటి సినిమాలు చూస్తే అర్ధం అవుతుంది… టాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు పొందేందుకు నిఖిల్ ఎంత కష్టపడుతున్నాడో. ఈ క్రమంలోనే మరో సినిమా 18 పేజెస్ కు కమిట్ అయ్యాడు నిఖిల్. ఈ చిత్రానికి సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తుండగా.. పల్నాటి సూర్య ప్రతాప్ డైరెక్టర్. గీతా ఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై సినిమా రూపొందుతోంది. కాగా చిత్రంలో నిఖిల్ మెమరీ లాస్ తో ఇబ్బంది పడే క్యారెక్టర్ చేస్తున్నాడట. అయినా కూడా తనను చుట్టుముట్టిన ఇబ్బందులను ఎలా పరిష్కరించాడు అనేదే కథ. ఇంతకు ముందు ఎవరూ టచ్ చేయని విధంగా కథ ఉండబోతోందట.

ఇక నిఖిల్.. తన సూపర్ హిట్ చిత్రం “కార్తికేయ” సీక్వెల్ కూడా చేయబోతున్నారు. కార్తికేయకు మించిన స్క్రిప్ట్ ను రెడీ చేశాడట డైరెక్టర్ చందు మొండేటి. స్టోరీ మీద ఉన్న నమ్మకంతో సినిమాను పాన్ ఇండియా మూవీగా కూడా రిలీజ్ చేయబోతున్నారట. మొత్తానికి నిఖిల్ కెరీర్ తొలినాళ్లలో చేసిన తప్పులనుంచి పాఠాలు నేర్చుకుని… ప్రస్తుతం సినీ ప్రయాణాన్ని సాఫీగా, సక్సెస్ ఫుల్ గా డిజైన్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు.

Tags: Nikhil, Nikhil Siddharth, 18 Pages, Karthikeya, Sukumar, Geetha Arts



Next Story

Most Viewed