మిలియన్ ఏళ్ల తర్వాత.. నిహారిక

by  |
మిలియన్ ఏళ్ల తర్వాత.. నిహారిక
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా హీరోయిన్ నిహారిక త్వరలో జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. డిసెంబర్‌లో పెళ్లి ఉండగా.. ఆలోపు కమిట్ అయిన సినిమాల వర్క్ పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే డబ్బింగ్ చెప్తున్న నిహారిక.. మిలియన్ సంవత్సరాల తర్వాత పని చేస్తున్నట్లు అనిపిస్తోందని తెలిపింది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై వస్తున్న వెబ్ సిరీస్‌కు తను డబ్బింగ్ చెప్తున్నట్లు సమాచారం.

మరో వైపు నిహారిక డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతుందట. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు నాగబాబు. డిసెంబర్ నెలలో పెళ్లి ఉండబోతుందని తెలిపిన మెగా బ్రదర్.. డెస్టినేషన్ వెడ్డింగ్ పనుల్లో వరుణ్ తేజ్ బిజీ అయిపోయాడని చెప్పాడు. ఇప్పటికే కొన్ని ప్రాంతాలు సెలెక్ట్ చేశాడని.. అందులో ది బెస్ట్ ఫైనల్ చేసి త్వరలో పెళ్లి ముహూర్తం, ప్లేస్ గురించి వివరిస్తామని తెలిపాడు. నిహారిక పెళ్లి విషయంలో కుటుంబం మొత్తం సంతోషంగా ఉందని.. ఇలాంటి సమయంలో తన వివాహం చాలా ఆనందాన్ని పంచుతుందన్నారు.


Next Story

Most Viewed