సమంతకు మెగా డాటర్ నిహారిక సపోర్ట్.. పెళ్లి తర్వాత అలా జరిగిందంటూ..

by  |
సమంతకు మెగా డాటర్ నిహారిక సపోర్ట్.. పెళ్లి తర్వాత అలా జరిగిందంటూ..
X

దిశ, వెబ్‌డెస్క్ : మెగా డాటర్ నిహారిక నిర్మాతగా ఫుల్ బిజీ అయిపోయారు. వరుస వెబ్ సిరీస్‌లతో బిజీ లైఫ్ గడుపుతున్నారు. అయితే, ఇటీవలే వివాహం చేసుకున్న నిహారిక.. పెళ్లి తర్వాత సినిమాల్లో నటించడంపై ఆసక్తికర విషయం వెల్లడించింది. తాజాగా ఆమె ఓ టీవీ చానెల్‌ ప్రోగ్రామ్‌లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమెతోపాటు.. ఓ వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్న నటుడు, యాంకర్ నిఖిల్‌ కూడా వచ్చారు. ఈ సందర్భంగా నిహారిక తన మ్యారేజ్ లైఫ్, సినిమా లైఫ్ గురించి పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. పెళ్లికి, సినిమా కెరీర్‌కు సంబంధం లేదని చెప్పింది.

ఉదాహరణగా సమంత ఇష్యూ తీస్తూ.. పెళ్లికి ముందు సమంతకు ఎంత క్రేజ్ ఉందో పెళ్లి తరువాత కూడా అంతే క్రేజ్ ఉంది. ఇంకా ఎక్కువ అయింది కూడా అని చెప్పుకొచ్చింది. అలా పెళ్ళి అయితే క్రేజ్ తగ్గుతుందని అనుకోవద్దంటూ కామెంట్స్ చేసింది. మా ఆయనకు నేను సినిమాలు చేయడమంటే ఇష్టం అందుకే చేస్తున్నా అంటూ ఓపెన్ అయింది. అయితే.. ఓటీటీ కంటెంట్లు, వెబ్ సిరీస్‌లతో తమ మార్క్ చూపించాలనే ప్రయత్నంలో భాగంగా రీసెంట్‌గా ‘ఒక చిన్న ఫ్యామిలీ’ అనే వెబ్ సిరీస్‌తో ఆడియన్స్ ముందుకొచ్చింది. మొత్తం ఐదు భాగాలుగా ఈ వెబ్ సిరీస్ రూపొందించింది నిహారిక.

Read more:

1. చైతు బర్త్‌డేకు సమంత పర్సనల్‌గా మెసేజ్ చేసిందా?

2. చైతుతో డైవోర్స్ ఇష్యూ.. అన్నీ సరిగ్గా ఉంటే ఎందుకు కాకూడదు? : సమంత

3. సమంతకు బంపర్ ఆఫర్.. వారి కాంబో రిపీట్..?



Next Story