పవర్ స్టార్ మూవీలో యువరాణిగా ‘ఇస్మార్ట్’ బ్యూటీ?

by  |
PSPK27
X

దిశ, వెబ్‌డెస్క్: మూడు సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇచ్చి సినిమాల్లో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే దిల్‌రాజు నిర్మాణం, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ చిత్రం షూటింగ్ పూర్తి అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు, టీటర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం.. జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో పవన్ మొట్ట మొదటిసారిగా పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లోనే కాకుండా, ఇండస్ట్రీలోనూ ఆసక్తి నెలకొంది. పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ 27వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాకు ‘హరిహర వీరమల్లు’ అనే టైటిల్‌ను ఖారారు చేస్తూ.. మహా శివరాత్రి సందర్భంగా ఫస్ట్‌లుక్, టైటిల్‌ అనౌన్స్ చేసింది చిత్ర బృందం. ఏ.ఎం.రత్నం నిర్మిస్తోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. మొఘలుల కాలం బ్యాక్‌డ్రాప్‌లో సినిమా తెరకెక్కుతోంది. ఇందులో పవన్‌ బందిపోటు పాత్రలో కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.

pawan kalyan nidhi agarwal

అయితే.. పవన్‌ కళ్యాణ్ ఇప్పటి వరకు చేయనటువంటి పాత్రను ఇందులో పోషిస్తున్నారు. దీంతో చిత్రం నుంచి రోజుకో గాసిప్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. అంతేగాకుండా, ఇండియన్‌ సినిమాల్లో ఇప్పటివరకూ రానటువంటి కథతో ఈ సినిమా రూపొందుతోంది. అప్పటి మొఘల్‌ చక్రవర్తులను ఎదురించిన వీరుడి కథ ఇది. దాంతో సినిమా గురించి తాజాగా మరో వార్త వైరల్ అవుతోంది. ఆ విషయం ఏంటంటే.. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైన నిధీ అగర్వాల్ యువరాణిగా, మరో కీలక పాత్ర కోసం ఎంపికైన జాక్వెలిన్ ఫెర్నాండేజ్ దొంగగా కనిపిస్తారని సమాచారం. అలాగే ఈ చిత్రంలో పవన్‌ కళ్యాణ్ దొంగగా నటిస్తున్నాడు. అతను కోహినూర్ వజ్రాన్ని దొంగిలించే పనిలో ఉంటాడని తెలుస్తోంది. చారిత్రాత్మక చిత్రంగా పేరుపొందిన ఈ సినిమాలో డైలాగ్స్ బుర్రా సాయి మాధవ్ రాస్తున్నారు. చార్మినార్, గోల్కొండ కోటతో పాటు పలు చారిత్రాత్మక ప్రదేశాల సెట్లను ప్రత్యేకంగా భారీ బడ్జెట్ తో వేస్తున్నట్లు తెలుస్తోంది. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. వచ్చే ఏడాది సంక్రాంతికి గ్రాండ్ రిలీజ్ కానున్న ఈ సినిమాపై అంచనాలు మరింత రెట్టింపయ్యాయి.



Next Story

Most Viewed