- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రతిసారి అలా చేయడం ఇబ్బందే.. కానీ తప్పడం లేదు : హీరోయిన్
<p>దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా ఉదృతి రోజు రోజుకూ పెరుగుతుంది. ఈ మహమ్మారి వైరస్ వలన అన్ని రంగాలు కుదేలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పలువురు ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. ఇక షూటింగ్‌లకు వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరూ కరోనా టెస్ట్ చేయించుకోవాలన్నది రూల్. తాజాగా టాలీవుడ్ అందాల తార నిధి అగర్వాల్ కూడా మరోసారి కరోనా టెస్ట్ చేయించుకుందట. ఇక ఈ విషయమై నిధి మాట్లాడుతూ… ‘లాక్ డౌన్ తరువాత మొదలైన ప్రతి […]</p>

దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా ఉదృతి రోజు రోజుకూ పెరుగుతుంది. ఈ మహమ్మారి వైరస్ వలన అన్ని రంగాలు కుదేలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పలువురు ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. ఇక షూటింగ్‌లకు వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరూ కరోనా టెస్ట్ చేయించుకోవాలన్నది రూల్. తాజాగా టాలీవుడ్ అందాల తార నిధి అగర్వాల్ కూడా మరోసారి కరోనా టెస్ట్ చేయించుకుందట. ఇక ఈ విషయమై నిధి మాట్లాడుతూ…
‘లాక్ డౌన్ తరువాత మొదలైన ప్రతి షూటింగ్‌కి నేను కరోనా టెస్ట్ చేయించుకొనేదాన్ని. మొదట్లో కొంచెం ఇబ్బందిగా ఉన్నా.. ఆ తరువాత అలవాటు అయిపోయింది. ఇప్పటివరకు 35 సార్లు నేను టెస్ట్ చేయించుకున్నాను. షూటింగ్‌లు అంటే ప్రతిసారి హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు, ముంబై లాంటి ప్రదేశాలు తిరగాల్సి వస్తుంది. అలాంటప్పుడు జర్నీ చేసిన ప్రతిసారి కోవిడ్ టెస్ట్ చేయించుకోవాల్సి వస్తుంది. కొంచెం ఇబ్బందిగా ఉన్నా.. ఈ ప్రక్రియ తప్పదు కదా’ అని చెప్పుకొచ్చింది. ఇకపోతే ప్రస్తుతం నిధి, పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హర హర వీర మల్లు’ చిత్రంలో నటిస్తుంది.






