మరో కోలీవుడ్ చాన్స్ కొట్టేసిన ఇస్మార్ట్ భామ

by  |
మరో కోలీవుడ్ చాన్స్ కొట్టేసిన ఇస్మార్ట్ భామ
X

దిశ, సినిమా : అందాల నిధి అగర్వాల్‌ కోలీవుడ్‌లో వరుస అవకాశాలు దక్కించుకుంటోంది. ‘భూమి’ సినిమాతో తమిళ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన భామ.. వెంటనే శింబు ‘ఈశ్వరన్‌’లోనూ నటించి మంచి మార్కులు కొట్టేసింది. ఆ రెండు సినిమాలు కూడా సక్సెస్ కావడంతో ఇస్మార్ట్ బ్యూటీకి ఫాలోయింగ్ బాగానే పెరిగిపోయింది. దీంతో తనకు అభిమానులు అక్కడ ఏకంగా గుడికట్టేశారు. మూవీలో న్యూ ఫేస్‌ను కోరుకునే మేకర్స్ కూడా తనకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఈ క్రమంలో కొత్తగా మరో కోలీవుడ్ చాన్స్ కొట్టేసింది భామ. హీరో ఉదయనిధి స్టాలిన్‌తో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. స్టాలిన్ హోమ్ ప్రొడక్షన్ ‘రెడ్ జెయింట్ మూవీస్‌’ బ్యానర్‌పై మూవీ తెరకెక్కుతుండగా.. ‘తడమ్’ ఫేమ్ మగిల్ తిరుమేని దర్శకత్వం వహించబోతున్నారు. మొత్తానికి నిధి కోలీవుడ్‌లోనూ బిజీ అవుతుండగా.. తెలుగులో ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ సినిమాతో బిజీగా ఉంది.



Next Story

Most Viewed