‘నిధి’ అగర్వాల్‌కు ‘హరిహర వీరమల్లు’ టీం ఊహించని గిఫ్ట్

by  |
nidi-agarwal
X

దిశ, సినిమా : అందాల నిధి అగర్వాల్‌కు ‘హరిహర వీరమల్లు’ మూవీ యూనిట్‌ అందంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. నిధి బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తూ విషెస్ అందించింది. ‘పంచమి’గా తనను పరిచయం చేసిన మూవీ యూనిట్.. “కృష్ణ పక్ష పంచమి వెన్నెల వన్నెలవా.. శుక్ల పక్ష పంచమి నెలవంక వయ్యారానివా?.. ఓ అందాల పంచమి.. ఎవరివే నీవెవరివే?” అంటూ తన అందాన్ని వర్ణిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. నృత్య భంగిమలో ఆకట్టుకుంటున్న నిధికి.. ‘పంచమి’ పాత్ర తన కెరియర్‌లోనే ప్రత్యేకంగా నిలిచిపోతుందని చెబుతున్నారు. 17వ శ‌తాబ్దం నాటి మొఘ‌లాయిలు, కుతుబ్ షాహీల కాలం నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో కాగా పూర్తిగా విజువల్ ట్రీట్ ఉండబోతుందని తెలుస్తోంది. మెగాసూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తుండగా.. బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కీలక పాత్రలో కనిపించబోతోంది.



Next Story

Most Viewed