కమల్ ‌కామెంట్‌పై నిధి అగర్వాల్ స్పందన

by  |
Nidhi Agarwal
X

దిశ, వెబ్‌డెస్క్ : ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్ కోలీవుడ్‌లోనూ హవా చూపిస్తోంది. తను నటించిన రెండు సినిమాలు సంక్రాంతికి రిలీజ్‌ అవుతుండగా.. ‘నిధి పొంగల్’ అంటూ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు. తమిళ్‌లో ఫస్ట్ సినిమా రిలీజ్ కాకముందే భారీ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న నిధి.. తమిళ్ డెబ్యూ మూవీ ‘భూమి’లో జయం రవితో జోడీ కట్టడం పట్ల అదృష్టంగా ఫీల్ అవుతోంది. జయం రవితో ఫస్ట్ మూవీ చేసిన హీరోయిన్లు స్టార్స్‌గా ఎదిగారని.. తనకు కూడా అలాగే మంచి ఫ్యూచర్ ఉంటుందని భావిస్తున్నట్లుగా తెలిపింది. కాగా భూమి జనవరి 14న డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో రిలీజ్ కాబోతుంది.

ఇక రెండో సినిమాకే సూపర్ స్టార్ శింబుతో నటించే చాన్స్ కొట్టేసిన భామ.. ‘ఈశ్వరన్’ షూటింగ్ స్పాట్ ఫ్యామిలీ అట్మాస్పియర్‌లా అనిపించేదని, సెట్‌లో శింబు యాక్టింగ్ స్కిల్స్‌కు ఫిదా అయిపోయానని వెల్లడించింది. ఈ క్రమంలోనే నిధి ‘తడమ్’ డైరెక్టర్‌తో చేస్తున్న మరో మూవీ చేస్తుండగా.. ఆ షూటింగ్ టైమ్‌లో తన కోసం ఫ్యాన్స్ భారీగా తరలిరావడం పట్ల చాలా హ్యాపీగా ఫీలైనట్లు తెలిపింది. ఈశ్వరన్ కూడా జనవరి 14న రిలీజ్ కానుండగా.. నటిగా బిగ్ స్క్రీన్‌పై కనిపించబోతున్న ఫస్ట్ తమిళ్ ఫిల్మ్ ఇదే కావడంతో ఎగ్జైటింగ్‌గా ఉందని చెప్పింది.

విజయ్ ‘మాస్టర్’ సినిమా టీజర్ చూసినప్పుడు హాలీవుడ్ పిక్చర్‌ చూసిన ఫీలింగ్ కలిగిందన్న నిధి.. ఈ మూవీలోని ‘వాతి కమ్మింగ్’ సాంగ్ వింటే సూపర్ ఎనర్జీ వస్తుందని తెలిపింది. అందరిలాగే ఈ సినిమా కోసం తను కూడా వెయిట్ చేస్తున్నట్లుగా తెలిపిన భామ.. జనవరి 13న థియేటర్‌లో సినిమా చూస్తానని తెలిపింది.

ఇక కమల్ హాసన్ థియేటర్లను దేవాలయాలుగా, ఓటీటీలను క్యాలెండర్లపై దేవుళ్ల బొమ్మగా అభివర్ణించడంపై స్పందించిన నిధి.. కమల్ సార్ చాలా పాజిటివ్‌గా కామెంట్ చేశారని అభిప్రాయపడింది. కానీ తన విషయంలో దేవాలయం, క్యాలెండర్ రెండూ ఉన్నాయని తెలిపింది.


Next Story

Most Viewed