ప్రపంచాన్ని కదిలించిన 5నెలల పసిగుడ్డు మరణం..

by  |
Nick Cannon
X

దిశ, సినిమా: ప్రముఖ అమెరికన్ స్టార్ కమెడియన్ ‘నిక్ కానన్’.. తన జీవితంలో ఎదుర్కొన్న అత్యంత భయంకరమైన విషయంపై ఓపెన్ అయ్యాడు. తన చిన్న కొడుకు మరణం గురించి తెలుపుతూ భావోద్వేగానికి లోనయ్యాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కానన్.. తన నాలుగవ సంతానంగా పుట్టిన జెన్ 5 నెలల వయసులోనే క్యాన్సర్ బారిన పడ్డాడని, దీంతో డాక్టర్లు కీమోథెరపీతో నయం చేస్తామని చెప్పినట్లు తెలిపాడు.కానీ పసిబిడ్డ బాధపడకూడదని భావించి తను కీమోకు అంగీకరించలేదని చెప్పాడు.

‘హైడ్రోసెఫలస్ అనే వ్యాధి (బ్రెయిన్ క్యాన్సర్) కారణంగా నా చిన్న కొడుకును కోల్పోవాల్సి వచ్చింది. నా పసిబిడ్డను కాపాడుకోలేకపోయినందుకు హృదయం చిన్నాభిన్నమైంది. జెన్ 5-10 సెకన్ల వరకు శ్వాస తీసుకోకుండా ఒకేసారి పెద్దగా ఊపిరి పీల్చుకునేవాడు. అంతసేపు అతను ప్రాణాలతో ఉన్నాడో లేదో అర్థమయ్యేది కాదు. ఒక తండ్రిగా, మనిషిగా నేను అనుభవించిన అత్యంత భయంకరమైన ఘటన. అయితే వైద్యులు బిడ్డ జీవించడానికి కొన్ని నెలల సమయం ఉందని చెప్పినప్పటి నుంచి ప్రతి నెలా తన పుట్టినరోజును జరుపుకున్నాం. బిడ్డ బతికినంతకాలం ఎక్కువ సమయం కౌగిలించుకునే ఉన్నాను’ అని తెలపడం ఈ ప్రపంచాన్ని కంటతడి పెట్టించింది.

రూట్ మార్చిన వొడాఫోన్ ఐడియా.. వాటిని తగ్గించేందుకే..!

Next Story

Most Viewed