తెలుగు రాష్ట్రాల్లో NIA సోదాలు.. మాజీ మావోయిస్టుల ఇళ్లలో తనిఖీలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2021-11-18 01:24:42  IST  )

<p>దిశ, ఎల్బీనగర్ : తెలుగు రాష్ట్రాల్లో NIA అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గురువారం తెల్లవారుజాము నుంచే ఏకకాలంలో తెలంగాణ, ఏపీలో 14 చోట్ల తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్‌లోని మాజీ మావోయిస్టుల ఇళ్లలో అధికారులు సోదాలు చేస్తున్నారు. నాగోల్‌లోని రవిశర్మ, అనురాధతో పాటు అమరుల బంధు మిత్రుల సంఘం నాయకురాలు భవానీ ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో మావోయిస్టులతో సంబంధాలపై ఆరా తీస్తున్నారు. అలాగే, ఏపీలోని ప్రకాశం జిల్లా ఆలకూరపాడులోని విరసం నేత కల్యాణ్‌రావు ఇంట్లో, విశాఖ [&hellip;]</p>

తెలుగు రాష్ట్రాల్లో NIA సోదాలు.. మాజీ మావోయిస్టుల ఇళ్లలో తనిఖీలు
X

దిశ, ఎల్బీనగర్ : తెలుగు రాష్ట్రాల్లో NIA అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గురువారం తెల్లవారుజాము నుంచే ఏకకాలంలో తెలంగాణ, ఏపీలో 14 చోట్ల తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్‌లోని మాజీ మావోయిస్టుల ఇళ్లలో అధికారులు సోదాలు చేస్తున్నారు. నాగోల్‌లోని రవిశర్మ, అనురాధతో పాటు అమరుల బంధు మిత్రుల సంఘం నాయకురాలు భవానీ ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు.

ఈ క్రమంలో మావోయిస్టులతో సంబంధాలపై ఆరా తీస్తున్నారు. అలాగే, ఏపీలోని ప్రకాశం జిల్లా ఆలకూరపాడులోని విరసం నేత కల్యాణ్‌రావు ఇంట్లో, విశాఖ అరిలోవలోని శ్రీనివాసరావు, అన్నపూర్ణ ఇళ్లలో కూడా NIA బృందం తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Next Story