- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఏపీ ప్రభుత్వానికి ఎన్జీటీ షాక్.. భారీ జరిమానా..
by srinivas |

X
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్‌జీటీ) భారీ షాక్ ఇచ్చింది. ప్రాజెక్టులకు సంబంధించి పర్యావరణ అనుమతులు ఉల్లంఘించారని ఎన్‌జీటీ ఆరోపించింది. ఈ మేరకు రూ.120 కోట్ల జరిమానా కట్టాలని ఎన్‌జీటీ తీర్పు వెల్లడించింది. రాష్ట్రంలోని మూడు ప్రాజెక్టులకు సంబంధించి జరిమానా విధించింది.
పురుషోత్తపట్నంకు రూ. 24.56 కోట్లు, పట్టిసీమ ప్రాజెక్టుకు 24.90 కోట్లు, చింతలపూడి ప్రాజెక్టుకు రూ. 73.6 కోట్లు జరిమానా విధించింది. ఈ జరిమానా మొత్తాన్ని మూడు నెలల్లోగా ఏపీ కాలుష్య నియంత్రణ మండలికి చెల్లించాలని ఎన్టీటీ ఆదేశించింది. వీటిని ఎలా వినియోగించాలో ఏపీ పీసీబీ, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలితో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని ఎన్జీటీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
Next Story