- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Viral : భర్తపై అనుమానంతో రహస్యంగా ఆ పనిచేసిన భార్య.. ఊహించని ట్విస్ట్‌తో చివరికి భర్త?!
Viral : భర్తపై అనుమానంతో రహస్యంగా ఆ పనిచేసిన భార్య.. ఊహించని ట్విస్ట్‌తో చివరికి భర్త?!

దిశ, ఫీచర్స్ : అనుమానం పాతరోగం అంటారు కానీ.. కొన్నిసార్లు అది వ్యక్తుల నిజ స్వరూపాన్ని కూడా బయట పెడుతుందని కూడా అంటుంటారు పెద్దలు. ఓ మహిళ విషయంలో సరిగ్గా అదే జరిగింది. భర్త మీద అనుమానంతో రహస్యంగా ఆమె చేసిన పని, అసలు విషయం బయపటడేలా చేయగా.. ఊహించని ట్వి్స్ట్‌తో భర్త ఖంగుతినాల్సి వచ్చింది. చివరికి ఈ వివాదం పోలీస్టేషన్ దాకా వెళ్లింది. ఇంతకీ ఆమె చేసిన పనేంటి? అనుమానంద దేనికి? అందులో రహస్యమేంటనే కదా మీ అనుమానం లెట్స్ గో అండ్ రీడ్ ఇట్!
అది గ్వాలియర్‌లోని మాధవ్ గంజ్ ఏరియా, 30 ఏండ్ల వయసు గల అభిరామ్ (రియల్ నేమ్ కాదు) ఒక ప్రైవేట్ సంస్థలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా వర్క్ చేస్తున్నాడు. అయితే అతను ప్రతిరోజూ ఇంటికి వచ్చాక, మునుపటిలా భార్యతో మాట్లాడటం, సరదాగా గడపడం వంటివి చేయడం మానేశాడు. దీంతోపాటు తరచుగా ఫోన్‌లో నిమగ్నం అవడం, ఫోన్ పక్కన పెడితే చాలు లాక్ చేసి ఉంచడం వంటివి చేస్తున్నాడు. అతని ప్రవర్తను గమనిస్తూ వచ్చిన భార్యకు మనసులో అనుమానం మొదలైంది. కానీ అతన్ని వెంటనే అడగలేదు. అతనికి తెలియకుండానే రహస్యంగా అసలు విషయం తెలుసుకోవాలనుకుంది.
తన భర్త అభిరామ్ ప్రవర్తనలో వచ్చిన మార్పుతో అతని రహస్యం తెలుసుకోవాలనుకున్న భార్య చివరికి ఇన్‌స్టాలో ఓ ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంది. తన భర్తకే ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి, అతను యాక్సెప్ట్ చేశాక రోజూ చాట్ చేయసాగింది. చివరికి అవతలి వ్యక్తి (అభిరామ్) ‘నువ్వే నా గర్ల్ ఫ్రెండ్ ఐ లవ్ యూ’ అంటూ ప్రపోజ్ చేశాడు. పైగా తనకు పెళ్లి కాలేదని, ఓ మల్టీనేషనల్ కంపెనీలో జాబ్ చేస్తు్న్నానని చెప్పుకొచ్చాడు. పర్సనల్‌గా కలుద్దామని వెంటపడసాగాడు. దీంతో సరే ఫలానా చోటకు వస్తే కలుద్దామని చెప్పింది ఆమె. సంతోషంతో ఎగిరి గంతేసిన అభిరామ్ తన గర్ల్ ఫ్రెండ్‌ను కలిసేందుకు వెళ్లాడు. అటువైపు తిరిగి ఉన్న ఆమెను ఎంతో ఉత్సాహంగా పలకరించిన అతను, ఆమె ఇటువైపు తిరగ్గానే ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ట్విస్ట్ ఏంటంటే.. ఇన్నాళ్లు తను చాట్ చేసిన ఆన్‌లైన్ గర్ల్ ఫ్రెండ్ ఎవరో కాదు, అతని భార్యే. చివరికి ఈ తగాదా పోలీస్ స్టేషన్ దాకా వెళ్లింది. అయితే పోలీసులు ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారట. ప్రజెంట్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. రకరకాల కామెంట్లతో క్యూరియాసిటీ ప్రదర్శిస్తున్నారు నెటిజన్లు.






