రూ. 9కే 100 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే e-Bike.. వాహనదారులు త్వరపడండి..

by  |

దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుతం చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. పెరుగుతున్న ఇంధన ధరలతో వాహనదారులు చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.. అంతే కాకుండా ఎలక్ట్రిక్ వాహనాల వలన కాలుష్యం కూడా తగ్గుతోంది. అందుకే ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు వివిధ రకాల డిస్కౌంట్లను కూడా ఇస్తోంది. ఇక ఎలక్ట్రిక్ వాహనాలు పొదుపుగా ఉండటమే కాకుండా పర్యావరణానికి కూడా హాని కలిగించవు, ఎందుకంటే బ్యాటరీతో నడిచే ఈ వాహనాలు ఇంధనంతో నడిచే వాహనాలలాగా కాలుష్యాన్ని పెంచవు. అంతే కాకుండా చాలా మంది బైక్ లవర్స్ ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు‌పై ఆసక్తి చూపుతున్నారు. దీంతో మారుతున్న ప్రజల ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకుని వాహన తయారీ సంస్థలు కొత్త ఎలక్ట్రిక్ వాహన మోడళ్లను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాయి. అందుకే కొత్తగా ఎలక్ట్రిక్ బైక్ తీసుకోవాలి అనుకునే బైక్ లవర్స్ కోసం ఎక్కువ మైలేజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ వాహనాల గురించి తెలియజేయడం జరుగుతోంది.

రివోల్ట్ ఆర్‌వీ ( REVOLT RV 400)

ఎంతో మంది ఇష్టపడే ఎలక్ట్రిక్ బైక్‌ల్లో రివోల్ట్ ఆర్‌వీ ఒకటి. అంతే కాకుండా మార్కెట్లో మొట్ట మొదటి సారిగా రివోల్ట్ ఆర్‌వి బైక్ విడుదలైంది. రూ. 9 కే ఈ ఎలక్ట్రిక్ బైక్ 100 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తోంది. అంతే కాకుండా దీని బ్యాటరీ సామర్థ్యం గరిష్టంగా 80 కి.మీ. డ్రైవింగ్ రేంజ్ గురించి చెప్పాలంటే, ఈ ఎలక్ట్రిక్ బైక్ ఫుల్ సింగిల్ ఛార్జింగ్‌తో 150 కిమీల రేంజ్‌ను అందిస్తుంది. దీన్ని పూర్తిగా ఛార్జ్ చేయడానికి 4.5 గంటల సమయం పడుతోంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ ధర ఢిల్లీలో రూ. 90,799 (ఎక్స్-షోరూమ్). మరీ ఇంకెందుకు ఆలస్యం బైక్ లవర్స్ త్వరగా ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను కొనుగోలు చేయండి.

జాయ్ ఈ-బైక్ joy e-bike monster

జాయ్ ఈ బైక్ చాలా తక్కువ ధరలో అందరికీ అందుబాటులో ఉంటుంది. మంచి మైలేజ్ కూడా ఇస్తోంది. దీనికి మాన్ స్టర్‌కు పవర్ కోసం లిథియం అయాన్ బ్యాటరీ ఇవ్వటం జరిగింది. దీని కారణంగా ఈ ఎలక్ట్రిక్ బైక్ ఒకసారి ఛార్జ్ చేస్తే 75 కిలోమీటర్ల పరిధిని అందిస్తోంది. అందువలన ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను చాలా మంది ఇష్టపడుతుంటారు. ఈ ఎలక్ట్రిక్ బైక్‌పై 280 కి.మీ ధర కేవలం రూ.70 మాత్రమే. దీని ధర గురించి చెప్పాలంటే, ఎలక్ట్రిక్ బైక్ , ఎక్స్-షోరూమ్ ధర రూ. 98,666. మంచి మైలేజ్ ఇవ్వడంలో ఇది బెటర్ బైక్. అంతేకాకుండా మార్కెట్లో కూడా దీనికి మంచి డిమాండ్ ఉంది.

Job Notifications Latest Current Affairs 2022


Read latest Telugu news disha daily epaper

Next Story

Most Viewed