- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విషాదం.. పెళ్లైన 4 రోజులకే భార్యాభర్తలు మృతి
<p>దిశ, వెబ్ డెస్క్: తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది. పెళ్లి చేసుకున్న 4 రోజులకే నూతన దంపతులు దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని అరక్కోణానికి చెందిన మనోజ్ కుమార్ (31), తాంబరం పెరుంగళత్తూరుకు చెందిన కార్తీక(30)తో అక్టోబర్ 28న పెళ్లి జరిగింది. ఈ నూతన దంపతులు కారులో సోమవారం ఉదయం పెరుంగళత్తూరు నుంచి అరక్కోణం బయలుదేరారు. కూవం వద్దకు రాగానే అటువైపు నుంచి వస్తున్న ఓ సిమెంట్ ట్యాంకర్ అదుపు తప్పి వీరు ప్రయాణిస్తున్న కారుపై […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది. పెళ్లి చేసుకున్న 4 రోజులకే నూతన దంపతులు దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని అరక్కోణానికి చెందిన మనోజ్ కుమార్ (31), తాంబరం పెరుంగళత్తూరుకు చెందిన కార్తీక(30)తో అక్టోబర్ 28న పెళ్లి జరిగింది. ఈ నూతన దంపతులు కారులో సోమవారం ఉదయం పెరుంగళత్తూరు నుంచి అరక్కోణం బయలుదేరారు. కూవం వద్దకు రాగానే అటువైపు నుంచి వస్తున్న ఓ సిమెంట్ ట్యాంకర్ అదుపు తప్పి వీరు ప్రయాణిస్తున్న కారుపై పడింది. ఈ ప్రమాదంలో నూతన దంపతులు మనోజ్ కుమార్, కార్తీక అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
- Tags
- cement tanker
Next Story






