ఏపీలో కొత్తగా 9,999 కరోనా కేసులు నమోదు

11

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ, ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నది. తాజాగా గడిచిన 24 గంటల్లో 9,999 కేసులు నిర్ధారణ అయినట్టు శుక్రవారం సాయంత్రం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. కాగా ఒక్కరోజే వైరస్ మూలంగా 77మంది మృతిచెందారు.

దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,47,686కు చేరింది. మృతుల సంఖ్య 4,779 కు చేరింది. వైరస్ బారిన పడి ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న యాక్టివ్ కేసుల సంఖ్య 96,191కు చేరింది. కరోనాను జయించి మొత్తం 4,46,716 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. తాజాగా ఇందులో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 1,499, పశ్చిమ గోదావరి జిల్లాలో 1,081 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.