బండికి ఉరి వేశారు

69

దిశ, మహబూబాబాద్: మనకు నష్టం కలిగించే పనిని లేదా నిర్ణయాలను మనం వ్యతిరేకిస్తున్నట్టు శాంతియుతంగా తెలపడాన్ని నిరసన అంటారు. నిరసనను ఒక్కొక్కరు ఒక్కో రీతిలో తెలుపుతుంటారు. అందులో కొన్ని మనం సాధారణంగా రోజూ చూసే నిరసనలు అయితే.. మరి కొన్ని వినూత్న రీతిలో ఉండేవి. మహబూబ్ నగర్ జిల్లాలో సీపీఐ నేతలు చేసిన నిరసన సరిగ్గా రెండో కోవలోకి వస్తోంది.

వివరాల్లోకి వెళితే… పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై నిరసన తెలిపాలని కేససముద్రం మండలంలో సీపీఐ నేతలు అనుకున్నారు. అయితే ఆ నిరసన కూడా వినూత్నంగా ఉంటే బాగుంటుందని అనుకున్నారు. అందుకే పెట్రోల్ ధరలపై ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ ద్విచక్ర వాహనానికి తాడుతో ఉరి‌ వేసి నిరసన తెలిపారు. నిరసనకు సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..