- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఐ శంకరయ్య కేసులో షాకింగ్ విషయాలు
by Shyam |
<p>దిశ, క్రైమ్‌బ్యూరో: ఓ భూ వివాదం కేసులో రూ.1.20లక్షలు లంచం తీసుకుంటూ షాబాద్ సీఐ శంకరయ్య ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే. తాజాగా మరో కేసు విషయంలో సీఐ శంకరయ్య పేరు వినిపిస్తుండటంతో సంచలనంగా మారింది. ఏడాదినర్నర క్రితం చిగురుపాటి జయరామ్ హత్యకేసులో నిందితుడు రాకేశ్‌రెడ్డికి సీఐ శంకరయ్య సహకరించినట్లు తెలుస్తోంది. దుండిగల్ సీఐగా శంకరయ్య ఉన్న సమయంలో ఓ భూ వివాదానికి సంబంధించిన విషయం మాట్లాడటానికి వచ్చిన రాకేశ్‌రెడ్డితో స్నేహపూర్వక వాతావరణం ఏర్పడింది. ఇదే క్రమంలో […]</p>
దిశ, క్రైమ్‌బ్యూరో: ఓ భూ వివాదం కేసులో రూ.1.20లక్షలు లంచం తీసుకుంటూ షాబాద్ సీఐ శంకరయ్య ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే. తాజాగా మరో కేసు విషయంలో సీఐ శంకరయ్య పేరు వినిపిస్తుండటంతో సంచలనంగా మారింది. ఏడాదినర్నర క్రితం చిగురుపాటి జయరామ్ హత్యకేసులో నిందితుడు రాకేశ్‌రెడ్డికి సీఐ శంకరయ్య సహకరించినట్లు తెలుస్తోంది. దుండిగల్ సీఐగా శంకరయ్య ఉన్న సమయంలో ఓ భూ వివాదానికి సంబంధించిన విషయం మాట్లాడటానికి వచ్చిన రాకేశ్‌రెడ్డితో స్నేహపూర్వక వాతావరణం ఏర్పడింది. ఇదే క్రమంలో పారిశ్రామిక వేత్త జయరామ్, ఆయన మేనకోడలు కాల్ డిటైల్ రికార్డు (సీడీఆర్)ను సేకరించి రాకేశ్‌కు అందించినట్లు సమాచారం. ఆ తర్వాత కొన్నాళ్లకే జయరామ్ హత్యకు గురైనట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, జయరామ్ 2019 జనవరి 31న హత్యకు గురి కాగా, ఫిబ్రవరిలో నెలాఖరులో శంకరయ్య దుండిగల్ నుంచి బదిలీ అయ్యారు.
Next Story






