సూపర్ స్టైలిష్‌గా రజినీ వైల్డ్ అడ్వెంచర్ టీజర్

by  |
సూపర్ స్టైలిష్‌గా రజినీ వైల్డ్ అడ్వెంచర్ టీజర్
X

దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ రజినీకాంత్ తన స్టైల్, స్వాగ్‌తో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. సినిమాల్లో కొత్త కొత్త ప్రయోగాలు చేసే తలైవా.. రియల్ లైఫ్‌లోనూ ప్రయోగాలకు పెద్ద పీట వేస్తున్నాడు. ఇందులో భాగంగానే ‘డిస్కవరీ ఛానల్‌’లో ప్రసారం అవుతున్న ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ హోస్ట్ బేర్ గ్రిల్స్‌తో కలిసి వైల్డ్ అడ్వెంచర్ చేశాడు. కర్ణాటకలోని బందీపూర్ ఫారెస్ట్‌లో రజినీ, బేర్ గ్రిల్స్ చేసిన అడ్వెంచర్ జర్నీ ప్రసారం కోసం వరల్డ్ మొత్తం ఎదురుచూస్తోంది.

ఈ షో మార్చి 23న రా. 8 గంటలకు ప్రసారం కానుండగా… ‘తలైవా ఆన్ డిస్కవరీ’ పేరుతో ఓ సాంగ్ రిలీజ్ చేసి ప్రమోషన్స్ చేస్తోంది డిస్కవరీ ఛానల్. ఈ వీడియో సాంగ్‌కు భారీ రెస్పాన్స్ రాగా.. ఇప్పుడు ఈ రియాలిటీ షోకు సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేశారు. బేర్ గ్రిల్స్ తన ట్విట్టర్‌లో ఈ టీజర్ విడుదల చేయగా… సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. సూపర్ స్టార్ తనపై విసిరన ప్రతీ చాలెంజ్‌ను స్వీకరించాడని… తను ఒక స్ఫూర్తి ప్రదాత అంటూ ప్రశంసలు కురిపించాడు బేర్ గ్రిల్స్. ఈ స్టైలిష్ టీజర్‌లో రజినీకాంత్ ట్రెక్కింగ్ ఆకట్టుకుంటోంది.


Tags:Super Star, Rajinikanth, Into the Wild, Bear Grylls, ThalaivaN Discovery



Next Story

Most Viewed