కమిషనరేట్లకు కొత్త సబ్‌ ఇన్‌స్పెక్టర్లు..!

by  |
కమిషనరేట్లకు కొత్త సబ్‌ ఇన్‌స్పెక్టర్లు..!
X

దిశ, క్రైమ్‌బ్యూరో: హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్లకు కొత్త సబ్ ఇన్‌స్పెక్టర్లను ప్రభుత్వం కేటాయించింది. 2019-20 సంవత్సరానికి గానూ తొమ్మిది నెలలు శిక్షణ పూర్తి చేసుకున్న 292 ట్రైనీ ఎస్ఐలను హైదరాబాద్‌కు 292, సైబరాబాద్ కమిషనరేట్లకు 90మందిని కేటాయించగా, వీరంతా శుక్రవారం రిపోర్టు చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆ రెండు కమిషనరేట్లలో 5 వారాల పాటు ప్రాక్టికల్ ట్రైనింగ్, 3 నెలల గ్రేహౌండ్స్ శిక్షణ అనంతరం వీరికి పోస్టింగ్ ఇవ్వనున్నారు.

ఈ సందర్భంగా హైదరాబాద్, సైబరాబాద్ సీపీలు అంజనీకుమార్, సజ్జనార్‌లు ట్రైనీ ఎస్ఐలకు అభినందనలతో స్వాగతం పలికారు. వారు మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేయాలనే దృక్పథం ప్రతి ఒక్కరిలో ఉండాలన్నారు. ప్రజలు ఎంతో నమ్మకంతో పోలీస్ శాఖ వద్దకు వస్తారని, వారి నమ్మకానికి తగ్గట్టుగా భరోసా ఇవ్వాలన్నారు. నిబద్దత, అంకితభావం, క్రమశిక్షణతో పని చేయాలని సూచించారు. పోలీసులు శారీరక ధృడత్వంతో పాటు నిరంతరం మానసికంగా అప్రమత్తంగా ఉండాలన్నారు. విధుల పట్ల ఎట్టి పరిస్థితుల్లోనూ అలసత్వం చూపించవద్దన్నారు.

సాంకేతిక వినియోగం, నేరాల అదుపు, బందోబస్తు చర్యలు, కేసుల దర్యాప్తు, కోర్టులో చార్జిషీటు దాఖలు చేసి నిందితులకు శిక్షలు పడేలా దర్యాప్తు చేయాలంటూ విధి నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లపై అవగాహన కల్పించారు. ప్రజలకు మరింత దగ్గరవ్వాలని, పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని కొత్త ఎస్ఐలకు మార్గనిర్దేశం చేశారు. సైబరాబాద్ క్రైమ్స్ డి‌సి‌పి రోహిణీ ప్రియదర్శినీ, ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed