ఇక ఆ సమస్య తీరినట్లే.. ధరణిలో కొత్త ఆప్షన్

by  |
ఇక ఆ సమస్య తీరినట్లే..  ధరణిలో కొత్త ఆప్షన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: భూ పరిపాలనలో మరో కొత్త ఆప్షన్​ వచ్చింది. ధరణి పోర్టల్​లో 31వ మాడ్యూల్​ను ప్రవేశపెట్టారు. దీంతో పట్టాదారు పేరుకు బదులుగా హౌజ్/హౌజ్​సైట్ ​అని పడినవారికి ఊరట లభించనుంది. ఈ ఆప్షన్​ ద్వారా దరఖాస్తు చేసుకుంటే సరిదిద్దనున్నారు. ఏదేని సర్వే నంబరులోని కొంత విస్తీర్ణం నాలా కన్వర్షన్ ​చేస్తే.. మొత్తాన్ని నాలా అని, హౌజ్​సైట్​ అని నమోదు చేస్తున్నారు. అలాంటి వారి పట్టాదారు పాసు పుస్తకాల్లో సరిదిద్దుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. మీ సేవా కేంద్రం నుంచి యాజమాన్యపు ఆధారాలు, ల్యాండ్​ ఫోటో లేదా వీడియో వంటివి సమర్పించాలి. దరఖాస్తుదారుడికి సంక్షిప్త సమాచారం వస్తుంది. మీ సేవా కేంద్రానికి వెళ్లి బయోమెట్రిక్​ అథెంటికేషన్​ చేయాలి. ఆ తర్వాత దరఖాస్తు కలెక్టర్​కు వెళ్తుంది. ఆయన పరిశీలించి ఆమోదించడమో లేదా తిరస్కరించడమో చేస్తారు. ఆమోదిస్తే పట్టాదారు పాసు పుస్తకం ఇంటికే వస్తుంది.


Next Story

Most Viewed