- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరో రెండు కొత్త మండలాలు
<p>దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో మరో రెండు కొత్త మండలాలు ఆవిర్భవించాయి. వికారాబాద్ జిల్లాలో చౌడపల్లి, మహబూబ్నగర్ జిల్లాలో మహమ్మదాబాద్ కేంద్రాలుగా పని చేస్తాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్కుమార్ గురువారం ప్రిలిమినరీ ఉత్తర్వులు జారీ చేశారు. వికారాబాద్జిల్లాలో చౌడాపూర్ కేంద్రంగా మండలాన్ని ప్రకటించారు. ఈ మండలంలోకి వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలోని చౌడాపూర్, మండిపల్, వీరాపూర్, విఠాలాపూర్, మక్తావెంకటాపూర్, అడవి వెంకటాపూర్, లింగంపల్లి గ్రామాలు, మహబూబ్నగర్ జిల్లాలోని నవాబుపేట మండలం నుంచి కొత్తపల్లి, పురుషంపల్లి, మల్కాపూర్, […]</p>

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో మరో రెండు కొత్త మండలాలు ఆవిర్భవించాయి. వికారాబాద్ జిల్లాలో చౌడపల్లి, మహబూబ్నగర్ జిల్లాలో మహమ్మదాబాద్ కేంద్రాలుగా పని చేస్తాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్కుమార్ గురువారం ప్రిలిమినరీ ఉత్తర్వులు జారీ చేశారు. వికారాబాద్జిల్లాలో చౌడాపూర్ కేంద్రంగా మండలాన్ని ప్రకటించారు.
ఈ మండలంలోకి వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలోని చౌడాపూర్, మండిపల్, వీరాపూర్, విఠాలాపూర్, మక్తావెంకటాపూర్, అడవి వెంకటాపూర్, లింగంపల్లి గ్రామాలు, మహబూబ్నగర్ జిల్లాలోని నవాబుపేట మండలం నుంచి కొత్తపల్లి, పురుషంపల్లి, మల్కాపూర్, మరికల్, కన్మన్ కాల్వ, మొగిల్లపల్లి, చాకలిపల్లి గ్రామాలను కలిపారు. అలాగే మహమ్మదాబాద్మండలంలో మహబూబ్నగర్ జిల్లాలోని గంఢీడ్మండలంలోని మహమ్మదాబాద్, సంగాయిపల్లి, అన్నారెడ్డిపల్లి, ముకర్లాబాద్, లింగాలపల్లి, మంగంపేట, చౌదర్పల్లి, గడిర్యాల్, నాంచెర్ల, జూలపల్లి గ్రామాలను చేర్చారు. ఈ మేరకు ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేశారు.






