సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేట్లు తగ్గించిన పంజాబ్ నేషనల్ బ్యాంక్!

102

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ) తన సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేట్లను తగ్గించింది. ఏడాదికి రూ. 10 లక్షల్లోపు నిల్వలపై వడ్డీ రేటును 2.80 శాతానికి, రూ. 10 లక్షల కంటే ఎక్కువ ఉన్న సేవింగ్స్ ఖాతాలపై 2.85 శాతానికి తగ్గిస్తున్నట్టు బ్యాంకు వెల్లడించింది. సవరించిన రేట్లు బుధవారం నుంచి అమల్లోకి వస్తాయని, ఇప్పటికే ఉన్న, కొత్త ఖాతాదారులకు ఇది వర్తిస్తుందని పేర్కొంది. ఇటీవలే పంజాబ్ నేషనల్ బ్యాంక్ 7 రోజుల నుంచి 10 ఏళ్ల కాలపరిమితి కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 2.9 శాతం నుంచి 5.25 శాతం మధ్య వడ్డీ రేట్లను అందిస్తున్నట్టు పంజాబ్ నేషనల్ బ్యాంక్ వివరించింది.

7.45 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 2.9 శాతం వడ్డీ రేట్లను అందిస్తుండగా, ఒక సంవత్సరం కంటే తక్కువ ఎఫ్‌డీలపై 4.4 శాతం వరకు వడ్డీని అందిస్తోంది. ఏడాది నుంచి రెండేళ్ల కాలపరిమితి కలిగిన టర్మ్ డిపాజిట్లపై 5.10 శాతం వడ్డీని ఇస్తున్నట్టు బ్యాంకు పేర్కొంది. 2-3 ఏళ్లకు 5.10 శాతం వడ్డీని బ్యాంకు తెలిపింది. 5-10 ఏళ్ల కాలపరిమితికి 5.25 శాతం వడ్డీని పీఎన్‌బీ వెల్లడించింది.