- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డాక్టర్స్ డే రోజున విషాదం.. వైద్యులైన నవ దంపతులు ఆత్మహత్య
<p>దిశ, వెబ్‌డెస్క్ : డాక్టర్స్ డే(JULY 1) రోజున విషాద ఘటన చోటుచేసుకుంది. వైద్యులైన నవ దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషాదకర ఘటన మహారాష్ట్రలోని పూణే నగరంలో వెలుగు చూసింది. వివరాల ప్రకారం.. ఆయుర్వేద వైద్యుడు నికిల్షేండకర్(27), మానసిక వైద్యురాలు అంకిత నికిల్ షేండకర్(26)లు ఇటీవలే వివాహం చేసుకున్నారు. అనంతరం పుణేలోని వావండిలో ఓ ఇంట్లో నివసిస్తున్నారు. అయితే, వీరిద్దరూ వేరు వేరు ఆసుపత్రుల్లో విధులు నిర్వర్తించేవారు. ఈ క్రమంలో గురువారం.. నికిల్, అంకిత ఫోన్‌లో […]</p>

దిశ, వెబ్‌డెస్క్ : డాక్టర్స్ డే(JULY 1) రోజున విషాద ఘటన చోటుచేసుకుంది. వైద్యులైన నవ దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషాదకర ఘటన మహారాష్ట్రలోని పూణే నగరంలో వెలుగు చూసింది. వివరాల ప్రకారం.. ఆయుర్వేద వైద్యుడు నికిల్షేండకర్(27), మానసిక వైద్యురాలు అంకిత నికిల్ షేండకర్(26)లు ఇటీవలే వివాహం చేసుకున్నారు. అనంతరం పుణేలోని వావండిలో ఓ ఇంట్లో నివసిస్తున్నారు. అయితే, వీరిద్దరూ వేరు వేరు ఆసుపత్రుల్లో విధులు నిర్వర్తించేవారు.
ఈ క్రమంలో గురువారం.. నికిల్, అంకిత ఫోన్‌లో ఏదో విషయంలో వాగ్వాదానికి దిగి.. సీరియస్‌గా మాట్లాడుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో నికిల్ ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకునే లోపే అంకిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంటి చేరుకున్న తర్వాత అంకిత మృతిని తట్టుకోలేక పోయిన నికిల్ కూడా ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు.






