ఆ మాస్కు కరోనా కిల్లర్..?

by  |
ఆ మాస్కు కరోనా కిల్లర్..?
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా వైరస్‌‌పై ఇప్పటికీ పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఎన్నో కంపెనీలు వైరస్‌కు చెక్ పెట్టేందుకు టీకాలు తెచ్చే పనిలో నిమగ్నమై ఉన్నాయి. ఇలాంటి సమయంలో కొవిడ్ సెకండ్ వేవ్ ప్రజలను మరింత కలవరపెడుతోంది. ఇప్పటికే కొన్ని దేశాల్లో రెండో దశ లాక్‌డౌన్ విధించారు. అటు ఢిల్లీలోనూ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఓ కాటన్ మాస్క్ కరోనా అంతంపై ఆశలు రేపుతోంది. ఈ మాస్క్ ధరించి సూర్యకాంతిలో 60 నిమిషాలు ఉంటే దాని సర్ఫేస్‌పై ఉన్న వైరస్ చనిపోతుందని, వైరస్‌‌లతోపాటు, బ్యాక్టీరియాను ఈ మాస్క్ 99.99 శాతం కిల్ చేస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

కరోనాను ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాల ప్రజలంతా మాస్క్ ధరించడం, ఫిజికల్ డిస్టెన్స్ మెయింటేన్ చేయడం, చేతులను శుభ్రంగా కడుక్కోవడం వంటి మూడు సూత్రాలను తప్పనిసరిగా పాటిస్తున్నారు. ఆ సూత్రాలను పాటించడం వల్లే చాలా మంది కరోనా బారిన పడకుండా ఉన్నారని ఎన్నో సర్వేలు తేల్చాయి. కొవిడ్‌ను అడ్డుకోవడంలో ఓ సాధారణ మాస్క్ సూపర్ ఎఫెక్టివ్‌గా పనిచేస్తే, యాంటీ వైరల్ మాస్క్ వస్తే, కరోనాకు చెక్ పెట్టడం ఖాయమని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే కరోనాను కిల్ చేసే ప్రభావవంతమైన కాటన్ మాస్క్‌ను తీసుకొచ్చారు. ఈ మాస్క్‌ను మళ్లీ మళ్లీ ఉపయోగించొచ్చు. ఈ సరికొత్త ఫేస్‌మాస్క్‌ను పదిసార్లు ఉతకవచ్చని, దానిలోని యాంటీమైక్రోబల్ చర్యను కోల్పోకుండా కనీసం వారం పాటు సూర్యరశ్మి తగిలేలా చూడాలని కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు.

కాటన్ ఫేస్‌మాస్క్‌పై సూర్యకిరణాలు పడిన వెంటనే రీయాక్టివ్ ఆక్సిజన్ స్పీసియెస్(ఆర్ఓఎస్)ను విడుదల చేస్తుందని కాలిఫోర్నియా పరిశోధకులు పేర్కొన్నారు. ఫలితంగా ఫేస్‌మాస్క్‌పై ఉన్న మైక్రోబ్స్‌ చనిపోతాయని వివరించారు. 2-డైథైలామినోఇథైల్ క్లోరైడ్ (డీఈఏఈ-ఈఐ) పాజిటివ్లీ చార్జ్ చైన్‌ను సాధారణ కాటన్‌కు అనుసంధానించడం ద్వారా పరిశోధకులు ఈ సరికొత్త కాటన్ ఫ్యాబ్రిక్‌ను తయారు చేశారు. ఈ మోడిఫైడ్ కాటన్‌ను నెగెటివ్ అయాన్లతో చార్జ్ అయిన ఫొటో సెన్సిటైజర్‌ సొల్యుషన్‌లో డిప్ చేస్తారు. ఇలా యాంటి బ్యాక్టిరియల్, యాంటి వైరల్ క్లాత్స్‌ను రూపొందిస్తారు. ఇందుకు సంబంధించిన పరిశోధన ఫలితాలు ఏసీఎస్ అప్లైడ్ మెటీరియల్స్ అండ్ ఇంటర్‌ఫేసెస్‌ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.


Next Story

Most Viewed