- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గంగానదిలో దొరికిన గంగమ్మ
<p>దిశ,వెబ్‌డెస్క్ : ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది. ఘాజీపూర్ కొత్వాలి ప్రాంతంలోని ఘాట్ వద్ద గంగానదిలో పడవనడిపే వ్యక్తికి ఓ పసిపాప ఏడుపులు వినిపించాయి. దీంతో అతను చుట్టుపక్కలా వెతికాడు అయినా ఎవరూ కనిపించలేదు..దాంతో నదిలో చూసేసరికి ఓ చెక్కపెట్టె కొట్టకుంటూ వస్తుంది. అందులో పాప ఉందని అనుమానంతో ఆ పెట్టను తీసుకుని గంగానదీ ఒడ్డుకు వెళ్లాడు అందులో ఉన్న పసిపాపను చూసి ఆశ్చర్యానికి గురైన ఆయన గట్టిగా అరిచాడు. దీంతో అతని అరుపులు […]</p>

దిశ,వెబ్‌డెస్క్ : ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది. ఘాజీపూర్ కొత్వాలి ప్రాంతంలోని ఘాట్ వద్ద గంగానదిలో పడవనడిపే వ్యక్తికి ఓ పసిపాప ఏడుపులు వినిపించాయి. దీంతో అతను చుట్టుపక్కలా వెతికాడు అయినా ఎవరూ కనిపించలేదు..దాంతో నదిలో చూసేసరికి ఓ చెక్కపెట్టె కొట్టకుంటూ వస్తుంది. అందులో పాప ఉందని అనుమానంతో ఆ పెట్టను తీసుకుని గంగానదీ ఒడ్డుకు వెళ్లాడు అందులో ఉన్న పసిపాపను చూసి ఆశ్చర్యానికి గురైన ఆయన గట్టిగా అరిచాడు. దీంతో అతని అరుపులు విన్న స్థానికులు అట్టపెట్టెలో ఉన్న పసిపాపను చూసి షాక్ అయ్యారు.
అయితే ఆ పెట్టెలో రెడ్ కలర్ క్లాత్‌లో పసిపాపను పెట్టి ఆమె పక్కకు ఓ పేపర్ పెట్టి పంపించారు. అందులో ఆ చిన్నారి జాతకచక్రం ఉంది. ఆమె జాతక చక్రం ప్రకారం చిన్నారికి గంగా అని పేరు పెట్టునట్టిగా పేపర్‌లో తెలిపారు. వీటితో పాటు కనకదుర్గ అమ్మవారి ఫొటో కూడా పెట్టెలో ఉండటంతో అందరూ ఆశ్చర్యానికి గురైనారు. దీంతో గంగమ్మే పాపరూపంలో మా దగ్గరికి వచ్చిందని పాపను తానే పెంచుకుంటానని పడవ నడిపే వ్యక్తి పోలీసులకు తెలిపాడు. కానీ దానికి పోలీసులు ఒప్పుకోకుండా పసిపాపను ఆశాజ్యోతి కేర్ సెంటర్ కు తరలించారు.






