ఈస్ట్ బెంగాల్‌పై గెలుపు.. 4వ స్థానంలో నార్త్ఈస్ట్ యునైటెడ్

by  |
ఈస్ట్ బెంగాల్‌పై గెలుపు.. 4వ స్థానంలో నార్త్ఈస్ట్ యునైటెడ్
X

దిశ, స్పోర్ట్స్ : ఐఎస్ఎల్ 2020/21 సీజన్‌లో ఓటములతో ప్రారంభించిన నార్త్ఈస్ట్ యునైటెడ్ క్లబ్ నెమ్మదిగా పుంజుకున్నది. మంగళవారం రాత్రి ఫటోర్డా స్టేడియంలో ఈస్ట్ బెంగాల్‌‌తో జరిగిన మ్యాచ్‌లో 2-1 తేడాతో విజయం సాధించి హైదరాబాద్ ఎఫ్‌సీని కిందకు నెట్టి 4వ స్థానానికి చేరుకొని ప్లేఆఫ్స్ ఆశలు మెరుగుపరుచుకున్నది. టాస్ గెలిచిన ఈస్ట్ బెంగాల్ క్లబ్ ఎడమ నుంచి కుడికి కిక్ చేయడానికి నిర్ణయించుకుంది. ఇరు జట్లు హోరాహోరీగా తలపడటంతో తొలి అర్దభాగంలో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు.

48వ నిమిషంలో సుహైర్ వడక్కీపీడిక గోల్ చేసి నార్త్ఆస్ట్ యునైటెడ్‌కు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. 55వ నిమిషంలో ఈస్ట్ బెంగాల్ ఆటగాడు సార్థక్ గొలూయ్ ఓన్ గోల్ చేయడంతో నార్త్ఈస్ట్ యునైటెడ్ ఆధిక్యం 2-0కి పెరిగింది. 87వ నిమిషంలో సుర్‌చంద్ర సింగ్ ఇచ్చిన పాస్‌ను సార్థక్ గోలూస్ గోల్‌గా మలచడంతో ఈస్ట్ బెంగాల్‌కు ఒక గోల్ లభించింది. నిర్ణీత సమయం ముగియడంతో నార్త్ఈస్ట్ యునైటెడ్ 2-1 తేడాతో విజయం సాధించింది. డీహెచ్ఎల్ విన్నింగ్ పాస్ అవార్డు ఇమ్రాన్ ఖాన్, హీరో ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సుహైర్ వడక్కీపీడిక గెలుచుకున్నారు.


Next Story