ఒలింపిక్స్‌కు తొలి భారత మహిళా సెయిలర్.. ‘నేత్ర’

by  |
ఒలింపిక్స్‌కు తొలి భారత మహిళా సెయిలర్.. ‘నేత్ర’
X

దిశ, ఫీచర్స్ : ప్రఖ్యాత ఒలింపిక్ క్రీడల్లో పతకం సాధించడం ఒక ఎత్తయితే, అందులో పార్టిసిపేషన్‌కు అర్హత సాధించడం కూడా ఒక అచీవ్‌మెంటే. ఎందుకంటే ప్రపంచవ్యాప్త దేశాల నుంచి ఎంతో మంది క్రీడాకారులు, అథ్లెట్లు పాల్గొనే ఒలింపిక్స్‌లో చాలా టఫ్ ఫైట్ ఉంటుంది. ‘ది బెస్ట్ ప్లేయర్’ మాత్రమే అర్హత సాధించగలరు. ఈ క్రమంలో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారత మహిళా సెయిలర్‌గా చెన్నైకి చెందిన 23 ఏళ్ల నేత్రా కుమనన్‌ చరిత్ర సృష్టించింది.

ఒమన్‌లో జరిగిన ఆసియా క్వాలిఫయర్స్‌కు సంబంధించి లేజర్ రేడియల్ సింగిల్ హ్యాండెడ్ బోట్ సెయిలింగ్ రేసులో నేత్రా కుమనన్ ఒలింపిక్స్ బెర్త్ కొట్టేసింది. 21 పాయింట్ల తేడాతో భారత్‌కే చెందిన రమ్య శరవణన్‌పై పైచేయి సాధించిన కుమనన్ క్వాలిఫై అయింది. ఈ విషయాన్ని అఫీషియల్‌గా అనౌన్స్‌ చేసిన ఆసియా సెయిలింగ్ సమాఖ్య అధ్యక్షుడు మాలవ్ ష్రాఫ్.. ఒలింపిక్ ఈవెంట్స్‌లో పాల్గొనబోయే పదో వ్యక్తి నేత్రా కుమనన్ అని తెలిపారు. కాగా భారత్ తరపున ఒలింపిక్స్‌లో పాల్గొన్న సెయిలర్లలో మాలవ్ ష్రాఫ్ కూడా ఒకరు. ఆయన 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో పాల్గొన్నారు. గతంలో భారత్ తరఫున తొమ్మిది మంది ఒలింపిక్స్‌కు అర్హత సాధించగా, వారందరూ పురుషులేనని ఆయన వెల్లడించారు.


Next Story

Most Viewed