అమీర్‌తో భార్య విడాకులకు కారణం ఆ హీరోయిన్ ?

by  |
అమీర్‌తో భార్య విడాకులకు కారణం ఆ హీరోయిన్ ?
X

దిశ, సినిమా : మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్‌పై సోషల్ మీడియా మండిపడుతోంది. శనివారం అమీర్ తన భార్య కిరణ్ రావ్‌ నుంచి విడాకులు తీసుకున్నట్లు ప్రకటించాడు. ఈ అనౌన్స్‌మెంట్ జరిగిన వెంటనే ఇంటర్నెట్‌లో ట్రోలింగ్ మొదలైంది. వీరిద్దరి విడాకులకు కారణం ‘దంగల్’ బ్యూటీ ఫాతిమా సనా షేక్ అనే విషయాన్ని ట్రెండ్ చేశారు. ‘దంగల్’ సినిమాలో కూతురిగా నటించిన భామ ఆ తర్వాత వెంటనే ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’లో అమీర్‌తో రొమాన్స్ చేయడం వెనుక కారణం ఇదేనని, వీరిద్దరి మధ్య ఎఫైర్ నడుస్తుందని చెప్తున్నారు. సినిమా ప్రమోషన్స్ వరకు జంటగా కనిపించడం ఓకే కానీ ఆ తర్వాత కూడా ఎందుకు లవ్ బర్డ్స్‌లా తిరగాల్సి వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. 15 ఏళ్లకోసారి అమీర్ ఖాన్ డైవోర్స్ సెలబ్రేషన్ చేసుకుంటాడా ఏంటి? అని సెటైర్స్ వేస్తున్నారు. ఫాతిమాకు కూడా తానే నెక్స్ట్ టార్గెట్ అని ఇప్పుడు అర్థం కాకపోవచ్చు కానీ 15 ఏళ్ల తర్వాత తన విషయంలోనూ ఇదే విడాకుల తంతు రిపీట్ అవుతుందని కామెంట్స్ చేస్తున్నారు.



Next Story

Most Viewed