మాట తడబడిన మంత్రి ఎర్రబెల్లి.. ఓ ఆట ఆడుకుంటున్న నెటిజన్లు

219

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణలో యాసంగిలో పండించే వరి ధాన్యం కొనుగోలుపై తాడో పేడో తేల్చుకొని వస్తామని చెప్పి సీఎం కేసీఆర్‌తో మంత్రులు ఢిల్లీకి బయలుదేరారు. ఆదివారం నుంచి బుధవారం వరకు ఢిల్లీలోనే ఉన్నప్పటికీ ప్రధాని మోడీని కలవకుండానే వచ్చేసిన విషయం తెలిసిందే. అయితే, దీనిపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మీడియాతో మాట్లాడుతూ.. ప్రధానిని కలవకపోవడానికి గల కారణాలను తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘‘ ఢిల్లీలో మూడు రోజులు ఉన్నా ప్రధానమంత్రిని కలిసేందుకు అపార్ట్మెంట్ ఇస్తలేరు.. కల్వడానికి అవకాశం ఇస్తలేరు’’ అని అన్నారు. దీనిని నెటిజన్లు ట్రోల్స్ చేస్తూ.. అది అపార్ట్మెంట్ కాదు సార్.. అపాయింట్మెంట్ అంటూ వీడియో పోస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మరి కొందరు నెటిజన్లు అయితే..‘‘ప్రధాని కూడా నాలాగే పనిలేకుండా ఉంటారని సీఎం కేసీఆర్ అనుకుంటున్నారు’’. ప్రధానిని కలవాలంటే ఓ షెడ్యూల్ ఉంటుంది. అంటూ ట్వీట్లు చేస్తున్నారు.

 

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..