- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నెటిజన్ ట్రెండ్.. కమ్యూనిస్ట్ హార్రర్ ఇన్ కేరళ
<p>దిశ, వెబ్‌డెస్క్: కేరళలో ఆరేండ్ల బాలికపై సీపీఐ(ఎం) కార్యకర్త అత్యాచారం, హత్య ఘటన దక్షిణ భారత దేశంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. సోషల్ మీడియాలో #JusticeforKeralagirls హ్యాష్‌ట్యాగ్ పేరుతో నెటిజన్ ట్రెండ్ అవుతోంది. కమ్యూనిస్టు పాలిత రాష్ట్రంలో మహిళలు, బాలికలపై లైంగిక వేధింపులు, హింస పెరుగుతోందని బీజేపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఇందుకు పోలీసుల అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్న క్రైమ్ రికార్డులను చూపుతూ.. పినరయి ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఇడుక్కి జిల్లాలోని వండిపేరియార్‌లోని చురకులం ఎస్టేట్‌లో జూన్ […]</p>

దిశ, వెబ్‌డెస్క్: కేరళలో ఆరేండ్ల బాలికపై సీపీఐ(ఎం) కార్యకర్త అత్యాచారం, హత్య ఘటన దక్షిణ భారత దేశంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. సోషల్ మీడియాలో #JusticeforKeralagirls హ్యాష్‌ట్యాగ్ పేరుతో నెటిజన్ ట్రెండ్ అవుతోంది. కమ్యూనిస్టు పాలిత రాష్ట్రంలో మహిళలు, బాలికలపై లైంగిక వేధింపులు, హింస పెరుగుతోందని బీజేపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఇందుకు పోలీసుల అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్న క్రైమ్ రికార్డులను చూపుతూ.. పినరయి ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు.
ఇడుక్కి జిల్లాలోని వండిపేరియార్‌లోని చురకులం ఎస్టేట్‌లో జూన్ 30వ తేదీన ఆరేండ్ల బాలికను ఎత్తుకెళ్లిన అర్జున్ అనే వ్యక్తి ఓ రూమ్‌లో బంధించి పలుమార్లు అత్యాచారం చేశాడు. అనంతరం హత్య చేశాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. వైద్యుల పోస్టుమార్టం రిపోర్టులోనూ నిజమని తేలింది. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇదే సమయంలో చిన్నారిని బలితీసుకున్న వ్యక్తిని కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబీకులు, బంధువులు, స్థానికులు తీవ్ర ఆందోళనలు చేపట్టారు.
ఇదే క్రమంలో ఆదివారం సీన్ రీకన్‌స్ట్రక్షన్ నేపథ్యంలో అర్జున్‌ను ఘటన జరిగిన స్థలానికి తీసుకువచ్చారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడికి చేరుకొని.. పోలీసుల ఎదుటే అర్జున్‌కు దేహశుద్ధి చేశారు. దీంతో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. అనంతరం నిందితుడిని స్థానికుల దాడి నుంచి బయటకుతీసుకొచ్చిన పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.
ఇక ఇదే విషయంపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. సీపీఐ పార్టీ కార్యకర్త ఇటువంటి దారుణానికి ఒడిగట్టడం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. #JusticeforKeralagirls హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే.. 2021 మే వరకు కేరళలో 886 అత్యాచార కేసులు, 1437 వేధింపుల కేసులు, 75 కిడ్నాప్ కేసులు, 149 ఈవ్ టీజింగ్, 1159 గృహ హింస కేసులు, 1502 ఇతర నేరాలు నమోదయ్యాయి. గత ఏడాది అయితే కేరళలో 12,659 కేసులు వెలుగులోకి వచ్చాయి. ఈ విషయాలు కేరళ పోలీసుల అధికారిక వెబ్‌సైట్‌లోనే ఉన్నాయి. ఇవే ఆధారాలను చూపిస్తూ కేరళలో మహిళలకు భద్రతా లేదని నెటిజన్లు ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు.
CPIM’s #KeralaModel has made the State unsafe for women and young girls. The numbers will shock you.
– 23,002 Molestation
– 10,433 Rapes
– 6,220 Child rapes
– 75,180 Cognizable crimes against women and 20,497 against childrenDalit women are easy target.#JusticeForKeralaGirls pic.twitter.com/Wuh7Eb3g8k
— Amit Malviya (@amitmalviya) July 12, 2021
Six-year-old girl was r@ped for 3 years by a Communist Party Member Arjun and he killed her last week when she became unconscious during his unnatural act!
Lutyens media and so called Liberals who cry for every small incident in UP is silent in this case!!#JusticeforKeralagirls pic.twitter.com/LCb6krx0zw— നചികേതസ് (@nach1keta) July 12, 2021






