పునర్ణవిపై నెటిజన్లు ఫైర్..

86

దిశ, వెబ్ డెస్క్: పునర్ణవి భుపాలమ్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రేక్షకులు ఏమైనా పిచ్చి వాళ్లు అనుకుంటుందా అంటూ ఫైర్ అవుతున్నారు. మేము ముందే అనుకున్నాం ఇలాంటి ట్విస్ట్ ఉంటుందని కొందరు అంటుంటే..సిరీస్ ప్రమోషన్స్ బాగానే డిజైన్ చేశారు. కానీ, ఆడియన్స్ ఏమైనా వెర్రివాళ్లు అనుకుంటున్నారా అని గట్టిగానే వేసుకున్నారు. మరికొందరేమో హమ్మయ్య..ఇప్పుడు నార్మల్ అయ్యా అని ప్రశాంతంగా ఫీల్ అవుతున్నారు. మరికొందరేమో అనవసరంగా రాహుల్ సిప్లిగంజ్‌ను ట్యాగ్ చేశామని ఫీల్ అవుతున్నారు.

ఇంతకీ ఏం జరిగింది అంటే..పునర్ణవి తనకు ఎంగేజ్మెంట్ అయిందని మొదటి రోజు రింగ్‌ను మాత్రమే చూపించింది. రెండో రోజు తనకు కాబోయే వరుడు అంటూ ఓ అబ్బాయిని పరిచయం చేసింది. ఇక ముచ్చటగా మూడో రోజు ఇదంతా తూచ్ అని..నేను చేయబోయే సిరీస్ ప్రమోషన్స్ ఇలా ప్లాన్ చేశామని చెప్పింది. దీంతో ఆడియన్స్ రియాక్షన్ పలు విధాలుగా ఉండగా..ఇలాంటి పిచ్చి ప్రమోషన్స్ ఆపమని వార్నింగ్ ఇచ్చారు చాలా మంది. ప్రతీ దానికీ ఓ హద్దు ఉంటుందని..హద్దు మీరి ప్రవర్తిస్తే అస్సలు బాగోదని హెచ్చరించారు. పబ్లిసిటీ కోసం మరీ ఇంత ఓవర్ చేయాలా అని కడిగిపారేసిన వాళ్లు కూడా ఉన్నారు. ఏదైతే ఏం లే ఎవరు ఎలా తిట్టుకున్నా తనకు, తన సిరీస్‌కు మాత్రం ప్లస్ అయిందని కామ్‌గా ఉంది పునర్ణవి.

తప్పక ఒప్పుకున్నాను అని.. ఈ సిరీస్ తో అసలైన క్రేజీ రైడ్ చూస్తారని అంటుంది. ఆహాలో నవంబర్ 13 నుంచి ప్రసారం కాబోతున్న కమిట్ మెంటల్ సిరీస్ చూసి సూపర్ గా ఎంజాయ్ చేస్తారని చెప్పింది. నేను కూడా సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నానని చెప్పింది పన్ను. టీవిఎఫ్, తమడ మీడియా సంయుక్తంగా నిర్మించిన సిరీస్ ను పవన్ సదినేని డైరెక్ట్ చేశారు.