నీకు 60 ఏళ్లా..? హీరో వ్యాక్సిన్ తీసుకోవడంపై నెటిజన్ల ఫైర్

by  |
Farhan Aktar
X

దిశ, సినిమా : బాలీవుడ్ హీరో ఫర్హాన్ అక్తర్ కొవిడ్ వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకున్నానని ట్విట్టర్ వేదికగా తెలిపారు. 47 ఏళ్ల యాక్టర్ ఈ విషయం ప్రకటించగానే నెటిజన్లు ఫైర్ అయ్యారు. ప్రస్తుతం బృహణ్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ కేవలం సీనియర్ సిటిజన్ల(60 ఏళ్లు.. ఆపై వయసున్నవారికి)కు మాత్రమే వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టగా తనకెలా వ్యాక్సిన్ ఇచ్చారని ప్రశ్నించారు. అంటే రూల్స్‌ బ్రేక్ చేసి, అధికారులకు లంచం ఇచ్చి వ్యాక్సిన్ తీసుకున్నారా? అని అడుగుతున్నారు. అధికారులు, సెలబ్రిటీలు మారరా? అని ఫైర్ అయ్యారు.

Next Story

Most Viewed