కేటీఆర్ మీ సాయం ఇదేనా.. మహిళ మృతికి మీరే కారణమంటూ ఫైర్

by  |
Minister KTR
X

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో ఏ సమస్య ఎదురైనా ఏ అధికారికి చెప్పినా.. ఏ మంత్రి, ఎమ్మెల్యేకు చెప్పినా లాభం లేకపోవడంతో బాధితులకు ట్విట్టర్ దారి చూపుతోంది. సమస్య ఏదైనా తనదైన శైలిలో మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. బాధితులకు అండగా నిలుస్తున్న విషయం తెలిసిందే. ఈ విధంగానే ఓ నెటిజన్ సాయం కోసం జూన్ నెలలో కేటీఆర్‌కు ట్వీట్ చేశారు.

ట్వీట్ ప్రకారం..‘‘ఆదిలాబాద్ జిల్లాకు చెందిన అమిత అనే మహిళ 2016 నుంచి ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతుండగా, ప్రస్తుతం ఆ సమస్య తీవ్రమైంది. ఆమెకు అత్యవసరంగా ఊపిరితిత్తుల మార్పిడి చేయాలి. ఈ చికిత్సకు రూ.25-30 లక్షలు అవుతుంది. చికిత్స చేయించేందుకు సాయం చేయండి’’ అంటూ మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశారు.

దానికి కేటీఆర్ స్పందించి..‘‘హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో మార్పిడి చేయిస్తాం. కేటీఆర్ ఆఫీసు కార్యాలయ సిబ్బంది మీతో సమన్వయం చేసుకొని నిమ్స్ వైద్యులతో మాట్లాడుతుంది’’ అని కేటీఆర్ ఆఫీస్‌కు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. కేటీఆర్ స్పందనతో నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తూ, అభినందిస్తూ కామెంట్లు చేశారు. దిక్కుతోచని స్థితిలో ఉన్న బాధితురాలి కుటుంబ సభ్యులు కూడా కేటీఆర్ ట్వీట్‌తో ఎంతో సంతోషించారు. ఇక రేపో మాపో ఆపరేషన్ కూడా జరుగుతుందని, తనకు ఎలాంటి ఇబ్బంది ఉండదని బాధితురాలు భావించింది. అలా కేటీఆర్ ఆఫీస్ సభ్యుల కోసం వేయికళ్లతో ఎదరుచూశారు. అలా ఎదురు చూస్తూనే బాధితురాలు ప్రాణాలు విడిచారు.

ఈ విషయాన్ని తెలుసుకున్న నెటిజన్ మంత్రి కేటీఆర్‌కు మరో ట్వీట్ చేశారు.‘‘ There was ZERO help from your @KTRoffice to the patients family. The woman passed away recently @KTRTRS while waiting for a pair for lungs to be transplanted.’’ అని చేశారు. అంటే.. మీ కేటీఆర్ ఆఫీస్ నుంచి బాధితురాలికి, వారి కుటుంబ సభ్యులకు ఎలాంటి సాయం అందలేదు. ఊపిరితిత్తుల మార్పిడికోసం ఎదురు చూస్తూ కొద్ది రోజుల క్రితమే మహిళ ప్రాణాలు విడిచారు.’’ అంటూ ట్వీట్ చేశారు. దీంతో కేటీఆర్ సాయానికి అభినందించిన నెటిజన్లే తీవ్రంగా మండిపడుతూ కామెంట్లు చేస్తున్నారు.


Next Story

Most Viewed