నాతో సెక్స్ చేస్తే.. కోరింది ఇస్తా.. ఓ నటికి వేధింపులు..!

by  |
నాతో సెక్స్ చేస్తే.. కోరింది ఇస్తా.. ఓ నటికి వేధింపులు..!
X

దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియాలో సినిమా హీరోయిన్లకు వేధింపులు తప్పడం లేదు. చిట్‌చాట్‌లోనూ, ఫోటోలకు కామెంట్లలోనూ నెటిజన్లు లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారు. ఇప్పటికే పలువురు హీరోయిన్లు తాము ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్నామని, కొంతమంది నెటిజన్లు తమ బాడీ పార్ట్స్ గురించి, తమ పర్సనల్ విషయాల గురించి కామెంట్స్ చేసి వేధిస్తున్నారని తెలిపారు. న్యూడ్ పిక్స్ అడగడం, బాడీ షేమింగ్ చేయడం చివరికి తమతో శృంగారం చేస్తావా..? అని కూడా అడిగే స్థాయికి చేరుకున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఒక దారుణ ఘటనే తానూ ఎదుర్కొన్నానని తమిళ నటి సౌందర్య నందకుమార్ తెలిపారు.

ఆకతాయిలు అడిగితే వారికి జ్ఞానం లేదనుకొనేదాన్ని కానీ తనను అడిగింది అందరికీ చదువు చెప్పే ఒక లెక్చరర్ అని తెలిసి బాధపడ్డానని తెలిపింది. ఇన్ స్టాగ్రామ్ చిట్‌చాట్లో తనను ఓ వ్యక్తి లెక్చరర్ గా పరిచయం చేసుకొని.. తనతో గడపాలని అడిగాడని, దాని కోసం ఎంత డబ్బైనా ఇస్తానని అన్నాడని తెలిపింది. అతనిపై చట్టరీత్యా కేసు నమోదు చేసి, అతన్ని కటకటాల పాలు చేస్తానని సౌందర్య తెలిపింది. ప్రస్తుతం తన అకౌంట్‌ను అతడు బ్లాక్ చేసాడని, అతన్ని ఎలాగైనా పట్టుకొని బుద్ధి చెప్తానని ఫైర్ అయ్యింది.

Next Story