నెట్‌ఫ్లిక్స్ ‘బాహుబలి’లో శివగామి పాత్రకు ఆ హీరోయిన్..

by  |
నెట్‌ఫ్లిక్స్ ‘బాహుబలి’లో శివగామి పాత్రకు ఆ హీరోయిన్..
X

దిశ, సినిమా : ‘బాహుబలి’ ఫ్రాంచైజ్ సూపర్ సక్సెస్ తర్వాత నెట్‌ఫ్లిక్స్ ‘బాహుబలి : బిఫోర్ ది బిగినింగ్’ సిరీస్‌ను తీసుకొచ్చేందుకు ప్రయత్నించింది. దేవకట్టా, ప్రవీణ్ సత్తారు డైరెక్షన్‌లో 80శాతం సిరీస్ కంప్లీట్ అయిన తర్వాత అవుట్‌పుట్‌తో శాటిస్‌ఫై కానీ నెట్‌ఫ్లిక్స్ దీన్ని పూర్తిగా పక్కనపెట్టేసి.. న్యూ డైరెక్టర్స్, న్యూ కాస్ట్ అండ్ క్రూతో సిరీస్‌ను నిర్మించేందుకు నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ‘జన్నత్’ డైరెక్టర్ కునాల్ దేశ్‌ముఖ్, ‘ది గర్ల్ ఆన్ ది ట్రైన్’ ఫేమ్ రిభు దాస్‌‌గుప్తా ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించబోతున్నారని సమాచారం. ఇక శివగామి పాత్రలో ఇంతకుముందు మృణాల్ ఠాకూర్ నటించగా.. ఈ క్యారెక్టర్‌కు కొత్తగా వామికా గబ్బి సెలెక్ట్ అయింది. రూ. 200కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న సిరీస్ షూటింగ్ సెప్టెంబర్‌లో ప్రారంభం కానుండగా.. అన్ని భారతీయ, అంతర్జాతీయ భాషల్లో విడుదల కానుంది.

Next Story

Most Viewed