- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాచారంలో నేపాలి దొంగలు.. వీడిన ముఠా గుట్టు
<p>దిశ, క్రైమ్ బ్యూరో : నాచారం పీఎస్ పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నేపాలీ ముఠాను మల్కాజిగిరి సీసీఎస్, నాచారం పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించి పట్టుకున్నారు. ఈ నెల 23 మంగళవారం రాత్రి 7గంటల సమయంలో మల్లాపూర్ బంగారం దుకాణం వద్ద అనుమానస్పదంగా కనిపించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి బంగారు హారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వారిని ప్రశ్నించగా సరైన సమాధానం ఇవ్వలేదు. దీంతో వారిని స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించగా నాచారం […]</p>

దిశ, క్రైమ్ బ్యూరో : నాచారం పీఎస్ పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నేపాలీ ముఠాను మల్కాజిగిరి సీసీఎస్, నాచారం పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించి పట్టుకున్నారు. ఈ నెల 23 మంగళవారం రాత్రి 7గంటల సమయంలో మల్లాపూర్ బంగారం దుకాణం వద్ద అనుమానస్పదంగా కనిపించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి బంగారు హారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వారిని ప్రశ్నించగా సరైన సమాధానం ఇవ్వలేదు. దీంతో వారిని స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించగా నాచారం పీఎస్ పరిధిలో 4 దొంగతనాలకు పాల్పడినట్లు అంగీకరించారు.
అంతేకాకుండా, మరో నలుగురు తమ ముఠా సభ్యులు ఉన్నట్టు చెప్పడంతో మహిళతో పాటు మొత్తం ఆరుగురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వీరి నుంచి సుమారు రూ.13.20 లక్షల విలువైన 21తులాల బంగారం, 50 తులాల వెండి, ల్యాప్‌టాప్, ఎల్ఈడీ టీవీ, ఇతర ఆభరణాలు, ఐఫోన్ తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు మల్కాజిగిరి ఏసీపీ శ్యామ్ ప్రసాద్ రావు తెలిపారు. ఈ సందర్భంగా నాచారం పోలీస్‌స్టేషన్ ఇన్ స్పెక్టర్ కిరణ్ కుమార్, డీఐ మల్లారెడ్డిలను ఏసీపీ అభినందించారు.






