యోగా భారత్‌లో పుట్టలేదా..? నేపాల్ ప్రధాని వివాదాస్పద వ్యాఖ్యలు

by  |
యోగా భారత్‌లో పుట్టలేదా..? నేపాల్ ప్రధాని వివాదాస్పద వ్యాఖ్యలు
X

కాట్మండు: నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి మరో వివాదాన్ని లేపారు. తమ దేశంలోనే యోగా పుట్టిందని కొత్త వాదనను తెరమీదకు తెచ్చారు. యోగా అభివృద్ధి చెందినప్పుడు అసలు భారతదేశ ఉనికి లేదని పేర్కొన్నారు. అప్పుడు భారత్ ముక్కలుగా, వేర్వేరు రాజ్యాలుగా ఉండిందని వివరించారు. యోగా తొలుత ఉత్తరాఖండ్‌లో పుట్టిందని, అప్పుడు ఉత్తరాఖండ్ భారత్‌లో భాగంగా లేదని, స్పష్టంగా చెప్పాలంటే ప్రస్తుత నేపాల్‌లో పురుడుపోసుకున్నదని చెప్పారు.

15వేల ఏళ్ల క్రితం శంభూనాథుడు యోగాను ప్రాక్టిస్ చేయగా, పతంజలి యోగా ఫిలాసఫీని అభివృద్ధి చేశారని, అది మతానికి అతీతమైనదని పేర్కొన్నారు. సాంఖ్య తత్వాన్ని ప్రచారం చేసిన కపిల్ ముని, ఆయుర్వేదాన్ని అభివృద్ధి చేసిన చరకుడూ ఇక్కడి వారేనని అన్నారు. నేపాల్‌కు చెందిన యోగా నిపుణుడు ప్రధాని ఓలి వ్యాఖ్యలను ఖండించారు. యోగా అనేది భరతవర్షలోని హిమాలయాలో పుట్టిందని, భరతవర్షలో ఇండియా, నేపాల్, పాకిస్తాన్, అఫ్ఘనిస్తాన్, టిబెట్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లు అంతర్భాగంగా ఉండేవని వివరించారు. హిమాలయాల్లో ధ్యానం చేసే మహర్షులు యోగాను అభివృద్ధి చేశారని పేర్కొన్నారు.


Next Story

Most Viewed