- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేపాల్ వివాదాస్పద మ్యాప్‌కు పెద్దల సభ ఆమోదం
by Shamantha N |
<p>ఖాఠ్మాండు: నేపాల్ వివాదాస్పద మ్యాప్ బిల్లుకు ఆ దేశ పార్లమెంటులోని ఎగువసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. భారత భూభాగాలు లిపులేఖ్, కాలాపానీ, లింపియాదురలను కలుపుకుని సవరించిన నేపాల్ రాజకీయ పటం కోసం ఆ దేశం రాజ్యాంగ సవరణ చేస్తున్నది. ఆ రాజ్యాంగ సవరణ బిల్లుకు ఇటీవల పార్లమెంటులోని దిగువసభ ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నేపాల్ కృత్రిమ భూవిస్తరణ ప్రకటనలు సమర్థనీయం కాదని భారత్ ఘాటుగా స్పందించింది. తాజాగా, జాతీయ అసెంబ్లీ లేదా ఎగువసభ కూడా […]</p>

X
ఖాఠ్మాండు: నేపాల్ వివాదాస్పద మ్యాప్ బిల్లుకు ఆ దేశ పార్లమెంటులోని ఎగువసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. భారత భూభాగాలు లిపులేఖ్, కాలాపానీ, లింపియాదురలను కలుపుకుని సవరించిన నేపాల్ రాజకీయ పటం కోసం ఆ దేశం రాజ్యాంగ సవరణ చేస్తున్నది. ఆ రాజ్యాంగ సవరణ బిల్లుకు ఇటీవల పార్లమెంటులోని దిగువసభ ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నేపాల్ కృత్రిమ భూవిస్తరణ ప్రకటనలు సమర్థనీయం కాదని భారత్ ఘాటుగా స్పందించింది. తాజాగా, జాతీయ అసెంబ్లీ లేదా ఎగువసభ కూడా వివాదాస్పద మ్యాపునకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. సభకు హాజరైన 57 మంది సభ్యులు బిల్లుకు అనుకూలంగా ఓటేశారు.
Next Story






