PM కీలక నిర్ణయం.. ముగ్గురు మాజీ ప్రధానుల నిరసన

by  |
PM కీలక నిర్ణయం.. ముగ్గురు మాజీ ప్రధానుల నిరసన
X

దిశ, వెబ్‌డెస్క్ : నేపాల్‌లో రాజకీయ అనిశ్చితి తీవ్రస్థాయికి చేరింది. ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలి తాజాగా తీసుకున్న నిర్ణయం వలన అక్కడి ప్రతిపక్ష పార్టీలు రోడ్డెక్కి నిరసన ప్రదర్శనలు చేపడుతున్నాయి. వారికి మద్దతుగా నేపాల్ మాజీ ప్రధానులు ముగ్గురు పుష్ప కమల్ దహల్ ప్రచండ, మాధవ్ కుమార్ నేపాల్ మరియు జాలా నాథ్ కనాల్ ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. అంతకుముందు నేపాల్ పార్లమెంటును ప్రధాని కేపీ శర్మ ఓలి రద్దు చేయాలని నిర్ణయించడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ప్రధాని పదవీకాలం ముగియడానికి ఇంకా రెండేళ్ల సమయం ఉంది.

కానీ, అధికార యంత్రాంగంతో పాటు పార్టీలోనూ కొందరు పరిపాలనకు సహకరించడం లేదని ప్రధాని గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆయన పార్లమెంటు రద్దు చేయాలని సంచలన నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, అధికార పార్టీ నేపాల్ రాజ్యంగ స్పూర్తికి విరుద్ధంగా చర్యలు తీసుకుంటోందని శుక్రవారం రాజధాని ఖాట్మండులో ప్రతిపక్షాలు భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రధాని తన నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేనియెడల తమ నిరసనను ఉధృతం చేస్తామని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు.


Next Story

Most Viewed