- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిగ్ బాస్ ఫస్ట్ కంటెస్టెంట్‌గా ఫేమస్ సింగర్..
<p>దిశ, సినిమా : కరోనా ఎఫెక్ట్ సినీ రంగంపైనా పడింది. థియేటర్లు మూతపడటంతో ఓటీటీకి ప్రాధాన్యత పెరిగింది. సిరీస్‌లతో పాటు సినిమాలు కూడా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైనే రిలీజ్ అవుతూ సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే రియాలిటీ షోస్ కూడా ఓటీటీని ఆశ్రయిస్తున్నాయి. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ హోస్ట్‌గా వరల్డ్స్ లార్జెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్.. డిజిటల్ వరల్డ్‌లోకి రాబోతోంది. ‘బిగ్ బాస్ ఓటీటీ’ పేరుతో ఆగస్టు 8 నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ […]</p>

దిశ, సినిమా : కరోనా ఎఫెక్ట్ సినీ రంగంపైనా పడింది. థియేటర్లు మూతపడటంతో ఓటీటీకి ప్రాధాన్యత పెరిగింది. సిరీస్‌లతో పాటు సినిమాలు కూడా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైనే రిలీజ్ అవుతూ సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే రియాలిటీ షోస్ కూడా ఓటీటీని ఆశ్రయిస్తున్నాయి. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ హోస్ట్‌గా వరల్డ్స్ లార్జెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్.. డిజిటల్ వరల్డ్‌లోకి రాబోతోంది. ‘బిగ్ బాస్ ఓటీటీ’ పేరుతో ఆగస్టు 8 నుంచి ప్రారంభం కాబోతోంది.
ఈ నేపథ్యంలో.. షో కంటెస్టెంట్స్ ఎవరనే విషయంపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. హౌజ్‌లోకి ఎంటరయ్యే సభ్యుల గురించి ఇప్పటికే రూమర్స్ స్ప్రెడ్ కాగా.. ఫస్ట్ కంటెంస్టెంట్ వివరాలను అఫిషియల్‌గా ప్రకటించారు నిర్వాహకులు. వూట్‌లో ప్రసారం కానున్న ‘బిగ్ బాస్ ఓటీటీ’ హౌజ్ ఇంటి సభ్యురాలిగా సింగర్ నేహా భాసిన్‌ను పరిచయం చేశారు. ఇతర కంటెస్టెంట్లకు టఫ్ కాంపిటీషన్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నానన్న ఈ సింగర్ ప్రోమో ఆడియన్స్‌ను మరింత ఎగ్జైట్ చేస్తోంది.






