- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నీరజ్ చోప్రాకు అందిన మహీంద్ర ఎక్స్‌యూవీ
<p>దిశ, స్పోర్ట్స్: టోక్యో ఒలింపిక్స్ 2020లో స్వర్ణ పతకం గెలిచిన నీరజ్ చోప్రాకు మహీంద్ర ఎక్స్‌యూవీ 800 బహుమతిగా అందింది. మహీంద్ర గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్ర టోక్యో ఒలింపిక్ విజేతకు ఎక్స్‌యూవీని బహుమతిగా ఇస్తానని మాట ఇచ్చాడు. అయితే కొత్త మోడల్ ఎక్స్‌యూవీ 800 విడుదలైన తర్వాత వెంటనే ఇవ్వకుండా.. కేవలం నీరజ్ చోప్రా కోసమే డిజైన్ చేసిన సరికొత్త వాహనాన్ని అందించారు. ఆ కారుపై నీరజ్ చోప్రా విసిరిన 87.56 మీటర్లను కూడా ముద్రించారు. […]</p>

దిశ, స్పోర్ట్స్: టోక్యో ఒలింపిక్స్ 2020లో స్వర్ణ పతకం గెలిచిన నీరజ్ చోప్రాకు మహీంద్ర ఎక్స్‌యూవీ 800 బహుమతిగా అందింది. మహీంద్ర గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్ర టోక్యో ఒలింపిక్ విజేతకు ఎక్స్‌యూవీని బహుమతిగా ఇస్తానని మాట ఇచ్చాడు. అయితే కొత్త మోడల్ ఎక్స్‌యూవీ 800 విడుదలైన తర్వాత వెంటనే ఇవ్వకుండా.. కేవలం నీరజ్ చోప్రా కోసమే డిజైన్ చేసిన సరికొత్త వాహనాన్ని అందించారు. ఆ కారుపై నీరజ్ చోప్రా విసిరిన 87.56 మీటర్లను కూడా ముద్రించారు. దానికి ముందు నీరజ్ జావెలిన్ విసురుతున్నట్లుగా లోగో కూడా ఉన్నది. ఈ బహుమతి అందుకున్న నీరజ్ ఆనంద్ మహీంద్రాకు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశాడు. ‘కొత్త కారు పంపినందుకు థాంక్యూ ఆనంద్ మహీంద్రా జీ. ఈ కారులో కస్టమైజేషన్స్ చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నది. త్వరలోనే దీన్ని బయటకు తీసి ఒకసారి తిప్పుతాను’ అని ట్వీట్ చేశాడు. ఇక పారాఒలింపిక్స్ జావెలిన్ త్రోలో గోల్డ్ సాధించిన సుమిత్ అంటిల్‌కు కూడా ఇలాంటి మోడల్ కారునే ఆనంద్ మహీంద్ర బహుమతిగా ఇచ్చారు.






